త్రిష, రుక్మిణి వసంతన్ ఆ ఇద్దరిలో వెంకీ హీరోయిన్ ఎవరు..?

Spread the love

Venky and Trivikram Movie: విక్టరీ వెంకటేష్‌ కొత్త సినిమా ఫైనల్ అయ్యింది కానీ.. ఇంకా స్టార్ట్ కాలేదు. సంక్రాంతి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించడంతో నెక్ట్స్ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే.. ఈ సినిమా గురించి అఫిషియల్ గా ప్రకటించకపోయినా.. అప్ డేట్స్ మాత్రం వచ్చేస్తున్నాయి. ఆగష్టులో ఈ సినిమా పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది. కథానాయిక ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు కానీ.. త్రిష, రుక్మిణి పేర్లు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంతకీ.. త్రిష, రుక్మిణి వసంతన్.. ఈ ఇద్దరిలో వెంకీ మూవీలో నటించే నాయిక ఎవరు..? త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి..?

వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో రూపొందే సినిమాకి రంగం సిద్దమైంది. దీనికి వెంకట రమణ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కేరాఫ్ ఆనంద నిలయం అనేది ట్యాగ్ లైన్. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరీ తరహాలో ఉండే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ గా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయడమే టార్గెట్ గా రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకీ 300 కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత రానున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు మించి ఉండేలా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఇక కథానాయిక విషయానికి వస్తే.. ముందుగా రుక్మిణి వసంతన్ పేరు వినిపించింది. ఈ అమ్మడు ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీలో నటిస్తుంది. త్రివిక్రమ్ రుక్మిణిని కాంటాక్ట్ చేశాడని.. దాదాపు ఈ అమ్ముడు ఇందులో నటించడం ఫిక్స్ అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు త్రిష పేరు వినిపిస్తోంది. వెంకీ, త్రిష ఇద్దరిదీ హిట్ కాంబినేషన్. ఈ కాంబోని త్రివిక్రమ్ రిపీట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలిసింది. అయితే.. డేట్లు బల్క్ గా కావాలి. త్రిష కావాల్సినన్ని డేట్లు ఇస్తుందా..? లేదా..? అనేది అనుమానం. త్రిష, రుక్మిణి వసంతన్.. ఈ ఇద్దరిలో ఒకరు మాత్రం కన్ ఫర్మ్. Venky and Trivikram Movie.

ఈ క్రేజీ మూవీకి మ్యూజిక్ ఎవరంటే.. త్రివిక్రమ్ తన సినిమాలకు ఈమధ్య ఎక్కువుగా థమన్ కే ఛాన్స్ ఇచ్చేవారు. ఈ సినిమాకి కూడా థమన్ నే ఎంచుకుంటారని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈసారి ఫ్రెష్ గా మిక్కీ జే మేయర్ కి ఇవ్వాలి అనుకుంటున్నారని టాక్. త్రివిక్రమ్ తెరకెక్కించిన అ ఆ సినిమా తర్వాత ఆయనతో మళ్లీ వర్క్ చేయలేదు. ఈ సినిమాకి మిక్క అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని.. ఆయన వైపే మొగ్గు చూపుతున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రావచ్చు. మరి.. వెంకీ, త్రివిక్రమ్ కలిసి ఎంత వరకు ఆడియన్స్ ని మెప్పిస్తారో..? ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

Also Read: https://mega9tv.com/cinema/suresh-raina-mr-ipl-he-will-be-making-his-debut-on-the-silver-screen-with-a-tamil-film/