ఆకట్టుకుంటున్న గోపీచంద్ కొత్త సినిమా ‘భరతవర్ష’ గ్లిమ్ప్స్

Spread the love

మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘భరతవర్ష ‘saga of shula’. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌ గా మారింది. గోపీచంద్ కెరీర్‌లో ఇది 33వ సినిమా కావడం కూడా ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేకమైన ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది. చాలా కాలంగా ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపీచంద్, ఈ సినిమాతో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని అందించడానికి రెడీ అవుతున్నట్లు  తెలుస్తోంది. ఈ చిత్రాన్ని టాలెంటెడ్  దర్శకుడుసంకల్ప్ రెడ్డి  తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ‘ఘాజీ’, ‘అంతరిక్షం’ వంటి విభిన్నమైన కథలతో తనదైన శైలిని చూపించిన సంకల్ప్ రెడ్డి, ఇప్పుడు ఒక హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ కథను చెప్పడానికి సిద్ధమయ్యారు. అందుకే ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.  ఈ సినిమాలో కథానాయికగా రీతూ వర్మ  నటిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెమరింత పెంచేసింది.  కేవలం 55 సెకన్ల పాటు  ఉన్న ఈ గ్లింప్స్ ప్రేక్షకులను  ఒక సరి కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోయిన అనుభూతి కలిగింది. ముఖ్యంగా 642 ఏడి కాలానికి చెందిన శూల రాజ్యాన్ని చూపించిన విధానం చాలా ఆకట్టుకుంది. గోపీచంద్ మేకోవర్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ అన్ని కలిసి ఈ పాత్ర హైలెట్ గా నిలుస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ‘భరతవర్ష’ అనే టైటిల్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది మన భారతదేశానికి పురాతన కాలంలో ఉన్న పేరు. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.  మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ అందించిన నేపథ్య సంగీతం కూడా గ్లింప్స్‌కి హైలెట్ గా నిలిచింది. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని అందించబోతుందని తెలుస్తోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *