పాకిస్తాన్ లో ధురంధర్ హవా..!

Spread the love

మన దేశం లో ఒక ఊపు ఊపిన ధురంధర్ సినిమా ఇప్పుడు మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ లో కూడా దుమ్ము దులుపుతుంది…రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ డ్రామా థియేటర్లలో సంచలన విజయం సాధించి ఇప్పటికే బాక్సాఫీస్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1400 కోట్లకు చేరువైన భారీ వసూళ్లతో ఈ సినిమా తన ప్రభంజనాన్ని చూపించిన తర్వాత, ఇప్పుడు అదే ఊపును OTT వేదికపైనా కొనసాగిస్తూ మరోసారి వార్తల్లో నిలుస్తోంది. గత నెల 30న ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ Netflixలో స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ చిత్రం విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే 7.6 మిలియన్ వ్యూస్ నమోదు చేసి అరుదైన రికార్డును సృష్టించింది. ఇప్పటికే డిజిటల్ ప్రపంచంలో భారీ స్పందన పొందిన ‘యానిమల్’ (6.2 మిలియన్), ‘ఫైటర్’ (5.9 మిలియన్), ‘పుష్ప-2’ (5.8 మిలియన్) వంటి చిత్రాల ప్రారంభ వ్యూస్‌ను దాటేసి ‘ధురంధర్’ కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయడం సినీ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది చిత్రంలోని గ్రాండ్ విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, భావోద్వేగాలతో కూడిన కథనం మరియు ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ తన ఎనర్జిటిక్ నటనతో చూపించిన ఎమోషన్స్ అని అభిమానులు చెబుతున్నారు. థియేటర్లలో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ చిత్రం, ఇప్పుడు ఇంటి వద్ద నుంచే చూసే ప్రేక్షకులకూ అదే స్థాయిలో థ్రిల్ అందిస్తుండటం విశేషం. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏడు దేశాల్లో టాప్-10 ట్రెండింగ్ జాబితాలో చోటు దక్కించుకోవడం ఈ సినిమా గ్లోబల్ రీచ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. అందులో ముఖ్యంగా పాకిస్థాన్‌లో నంబర్-1 స్థానాన్ని దక్కించుకోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. భాషా, సరిహద్దుల అడ్డంకులను దాటి కంటెంట్ శక్తి ఎలా పనిచేస్తుందో ‘ధురంధర్’ మరోసారి నిరూపించింది అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. థియేటర్లలో ప్రారంభమైన విజయయాత్ర ఇప్పుడు OTTలోనూ అదే జోరుతో కొనసాగుతుండటంతో, రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది మార్చ్ 19th ఈ సినిమా కి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే.