నందమూరి అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘NBK 111’ గురించి ఒక సాలిడ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ‘వీరసింహారెడ్డి’తో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ‘గాడ్ ఆఫ్ మాసెస్’ బాలకృష్ణ మరోసారి మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చేతులు కలపడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో సినిమా మొదలయ్యే ముందే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఐతే తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక చిత్రం మార్చి 6వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. అది కూడా సాధారణ సన్నివేశంతో కాదు, ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ మొదలు కానుందట.
ఈ సినిమాలో బాలయ్యను ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని ఒక కొత్త అవతారంలో చూడబోతున్నారు. ఆయన ఒక పవర్‌ఫుల్ అండర్‌వర్‌ల్డ్ డాన్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో యాక్షన్, ఎమోషన్, డ్రామా అన్నీ సమంగా మిళితమై ఉంటాయని సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ కథను చాలా జాగ్రత్తగా సిద్ధం చేశారని, బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా మరింత ఎలివేషన్ సీన్స్ ప్లాన్ చేశారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ చిత్రంలో అగ్ర కథానాయిక నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న విషయం కూడా అభిమానులను మరింత ఆనందపరుస్తోంది. బాలయ్య-నయనతార కాంబినేషన్ ఇప్పటికే పలుమార్లు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఈ జోడీ స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో ఎన్బీకే 111పై హైప్ మరింత పెరిగింది. మాస్, యాక్షన్, స్టైలిష్ మేకోవర్, పవర్‌ఫుల్ డైలాగులు… ఇలా అన్ని అంశాలు కలిసిన ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందే ఇంత క్రేజ్ ఉంటే, టీజర్, ట్రైలర్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మొత్తానికి ‘NBK 111’ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.