ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హోళీ శుభాకాంక్షలు

Spread the love

హోలీ పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు శుభాకాంక్షలు తెలిపారు. 

ఏపీ సీఎం చంద్రబాబు:

హోలీ పర్వదినం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. చెడు పై మంచి గెలుపునకు సూచికగా ‘కామ దహనం’తో ప్రారంభమయ్యే హోలీ పండుగ మనందరి జీవితాల్లో కొత్త రంగులు అద్దుతుంది. హోలీ పండుగ సందర్భంగా బంధుమిత్రులతో, సాటివారితో ఆనందం పంచుకుని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. హోలీ పండుగ సందర్భంగా అందరికి మరొక్కమారు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

ఏపీ మంత్రి నారా లోకేష్:

వ‌సంత రుతువుకు స్వాగ‌తం ప‌లికే రంగుల సంబ‌రం హోలీ. చెడుపై గెలిచిన మంచికి సంకేతం హోలీ. స‌మ‌త‌, మ‌మ‌త‌ల‌కు చిహ్నంగా, పేదా- పెద్ద తార‌త‌మ్యాలు లేకుండా, కుల‌మ‌త భేదాలు చూడ‌కుండా రంగుల్లో అంతా క‌లిసిపోయి ఆనందాల‌ను పంచుకునే హోలీ పండుగ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *