టాలీవుడ్లో అక్కినేని కుటుంబానికి ఉన్న ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ హీరో నాగార్జున ఇప్పుడు 100 వ సినిమా చేస్తున్నారు… ఇక నాగ చైతన్య వృష కర్మ సినిమా తో బిజీ గా ఉన్నాడు. ఇక అఖిల్ జూన్ లో లెనిన్ సినిమా తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుంచే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది మురళీ కిషోర్ అబ్బూరు. ఈ సినిమా విడుదల తేదీ విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఇంతకుముందే విడుదల కావాల్సిన పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదల అవుతుందని ప్రకటించడంతో… బాక్సాఫీస్ వద్ద పోటీ ఎక్కువ అవుతుందని భావించిన లెనిన్ టీమ్ తమ సినిమాను వాయిదా వేసింది. అలా ఈ సినిమా జూన్ 26కు మారింది. అయితే ఇక్కడితో ఆగలేదు ఈ కథ. మళ్లీ పెద్ది సినిమా కూడా వాయిదా పడుతూ జూన్ 25కు వెళ్లింది. దీంతో మరోసారి గందరగోళం మొదలైంది. లెనిన్ సినిమా మళ్లీ వాయిదా పడుతుందా? లేక అదే తేదీకి వస్తుందా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు కూడా కన్ఫ్యూజన్లో పడ్డారు. ఇలాంటి సమయంలో ఈ విషయంపై స్పష్టత వచ్చింది. నాగార్జున స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… లెనిన్ సినిమా జూన్ 26న విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు. నిన్న రాత్రి మా సినిమా ‘LENIN’ ఫస్ట్ కట్ చూశాను.నేను చాలా గర్వంగా, నమ్మకంతో చెబుతున్నాను… 2026 జూన్ 26న మీరు ఒక కొత్త అఖిల్ (AKHIL) ను చూడబోతున్నారు.ఆ తేదీని గుర్తు పెట్టుకోండి!!!థియేటర్లలో కలుద్దాం అంటూ నాగార్జున పోస్ట్ చేశారు. ఈ ప్రకటనతో అన్ని రూమర్లకు తెరపడింది. ఇక ఈ సినిమా అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సాంగ్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.