టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా క్రికెట్‌తో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతోనూ తరచూ సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తుంటారు. ఇక తాజాగా బాలీవుడ్ నటి మనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి మూవీతో సుపరిచితమైన బ్యూటీ అమీషా పటేల్‌తో హార్దిక్ డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ రూమర్ వైరల్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ గాసిప్‌పై అమీషా పటేల్ రియాక్ట్ అయ్యింది. బెంగళూరులోని ఓ హోటల్ పార్టీలో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారింది. అమీషా పటేల్, హార్దిక్ పాండ్యా ఒకే వేదికపై కనిపించారు. అక్కడ తన స్నేహితులకు హార్దిక్‌ను పరిచయం చేస్తూ అమీషా భుజంపై చేయి వేసిన ఒక చిన్న వీడియో క్లిప్ క్షణాల్లో వైరల్ అయింది. ఇంకేముంది, సోషల్ మీడియాలో కొందరు రకరకాల ఊహాగానాలు మొదలుపెట్టేశారు. ఇవి పెద్ద దుమారమే రేపాయి. మరి ఈ పుకార్లపై అమీషా పటేల్ తనదైన శైలిలో ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఎక్స్ వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా గట్టిగా తిప్పికొట్టేశారు. నిజమేనంటూ సెటైర్లు వేస్తూ, ఒక మహిళ తన స్నేహితుడి భుజంపై చెయ్యి వేస్తే అది డేటింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. మీకు కనీసం తోడూ నీడా స్నేహితురాలిగా ఒక అమ్మాయి కూడా లేనట్లుందని ఆ ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు అమీషా. ఈ క్లారిటీతో ఆ రూమర్ల వేగం ఒక్కసారిగా తగ్గిపోయింది. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అమీషా పటేల్, ఇలాంటి నిరాధారమైన వదంతులను ఎప్పుడూ ఊరుకోకుండా గట్టిగానే స్పందించారు. గతంలో కూడా తన వివాహం , వ్యక్తిగత జీవితంపై వస్తున్న తప్పుడు వార్తలను ఆమె బహిరంగంగానే ఖండించారు. కెరీర్ పరంగా ఎన్నో విజయాలను అందుకున్న ఆమె, ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ , పనికిమాలిన ఊహాగానాల వల్ల తన వ్యక్తిగత పరువుకు భంగం కలిగించే ప్రయత్నాలను తీవ్రంగా తప్పుబట్టారు. సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేసే ముందు కనీస ఇతరుల ప్రైవసీని గౌరవించాలని హితవు పలికారు. భవిష్యత్తులో సోషల్ మీడియా వేదికలపై ఇలాంటి తప్పుడు వార్తలు అరికట్టడానికి మరింత కఠినమైన డిజిటల్ నిబంధనలు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు వాదిస్తున్నారు.సోషల్ మీడియాలో వచ్చే ప్రతి చిన్న వీడియోను తప్పుగా అర్థం చేసుకుని వైరల్ చేయడం ఎంతవరకు సబబు అనే ప్రశ్నలు వస్తున్నాయి. అమీషా పటేల్ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్‌తో ఈ వార్తలకు ఫుల్స్టాప్ పడినట్లయింది. సెలబ్రిటీల ప్రతి కదలికనూ భూతద్దంలో పెట్టి చూసే నెటిజన్లకు ఇది నిజంగా పెద్ద చెంపపెట్టు అనే చెప్పాలి.