ఉగ్రకుట్ర భగ్నం…ఉగ్రముఠాను అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు

Spread the love

దేశంలో పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు  కుట్రలు పన్నుతున్న దుండగులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ కు చెందిన ఐ.ఎస్.ఐ తో  ఈ ముఠాకు సంబంధమున్నట్లు గుర్తించారు. లక్నో, ఘజియాబాద్ వంటి ప్రాంతాల్లో ట్రైన్స్ రాకపోకలకు అంతరాయం కలిగించి భారీగా దాడులు చేసేందుకు కుట్రలు పన్నినట్లు తెలుస్తోంది. విదేశాల నుండి ఫండ్స్ పొందుతున్న ఒక సంస్థ వీరికి సహకరించినట్లు పోలీసులు తెలిపారు. లక్నో రైల్వే స్టేషన్ దగ్గరలోని రైల్వే సిగ్నల్ బాక్స్ ను టార్గెట్ గా చేసుకోవడానికి మీరట్ కు చెందిన సాకిబ్ మరో ముగ్గురు వ్యక్తులు ప్రయత్నిస్తున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇన్వెస్టిగేషన్ లో వారికి ఉగ్ర ముఠాతో సంబంధం ఉందని గుర్తించామని అన్నారు. ఉగ్రదాడులకు టార్గెట్ గా చేసుకున్న ప్రదేశాలకు సంబంధించిన ప్రదేశాల ఫోటోలను, వీడియోలను  ఎప్పటికప్పుడు ప్రధాన నిందితుడు సాకిబ్ పాకిస్థాన్ హ్యాండ్లర్లకు పంపిస్తున్నట్లు ఇన్వెస్టిగేషన్ లో తేలినట్లు తెలిపారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *