విభిన్నమైన కథాంశాలున్న సినిమాలతో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ముందుకు సాగుతున్న నటుడు అడివి శేష్. ఆయన నుండి సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకుల్లో ఆసక్తినెలకొంటుంది. ఇంతకుముందు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘హిట్’, ‘మేజర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేశారు. ఇక ప్రస్తుతం ఆయన నుండి వస్తున్న రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్’ పై కూడా మంచి అంచనాలున్నాయి. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఈ ట్రైలర్ ను రూపొందించారు. మృణాల్ ఠాకూర్, అడివి శేష్ ల నటన, వారి మధ్య కెమిస్ట్రీ అలరించేలా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్లింగ్ విజువల్స్ సినిమాపై ఆసక్తిపెంచే విధంగా ఉన్నాయి. షానియల్ డియో ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 10న విడుదల కానుంది.