
Thermal Time Bomb: దక్షిణ సముద్రం కింద ఓ పెద్ద బాల్ ఆకారంలో ఉండే ఒక దానికి సైంటిస్టులు చూశారు. అది ఒక టైమ్ బాంబు లాంటిది అని…అది ఎప్పుడు పేలుతుందో తెలియదని…అది బ్లాస్ట్ అయితే ఈ భూమిపై అగ్ని ప్రళయం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇంతకు అక్కడ ఏం జరుగుతుంది…ఇంకా ఏ విషయాలు కనిపెట్టారు సైంటిస్టులు తెలుసు కోవాలంటే లెట్స్ వాచ్ నౌ.
అంటార్కిటికాని స్వయంగా దక్షిణ మహా సముద్రం అని పిలుస్తుంటారు. ఎందుకంటే.. అది పూర్తిగా మంచు రూపంలో ఉన్న మహా సముద్రం అంటున్నారు. అది శతాబ్ద కాలంగా భూమిని కాపాడుతూ ఉంది. మనుషులు ఉత్పత్తి చేస్తున్న వేడి, కార్బన్ డై ఆక్సైడ్‌ని అంటార్కిటికా చల్లబరుస్తోంది. దీంతో భూమి వేడెక్కి.. కాలిపోకుండా చేస్తోంది. హీట్‌వేవ్స్ మరింత పెరిగిపోకుండా ఆపుతోంది. కానీ.. ఇప్పుడు అంటార్కిటికా వేగంగా కరిగిపోతోంది. అంటే.. త్వరలోనే ఓ పెద్ద అగ్ని ప్రళయం భూమిని చుట్టుముట్టడం ఖాయమని శాస్త్రవేత్తలు అంటున్నారు.
అంటార్కిటికా సముద్రం.. భూమి వేడిని తన దగ్గర బంధించి ఉంచింది. అది కరిగిపోతోంది కాబట్టి.. త్వరలోనే ఆ వేడి.. ఒక్కసారిగా వాతావరణంలోకి రావడం ఖాయం. అప్పుడు.. భూమి.. ఇప్పుడు ఉన్నట్లు ఉండదు. విపరీతమైన పరిణామాలు కనిపిస్తాయి. వాతావరణం భరించలేనంత వేడిగా మారిపోతుంది. హీట్ వేవ్స్ ఎక్కువైపోతాయి. అతి తీవ్ర తుపాన్లు విరుచుకుపడగలవు. ఈ పరిస్థితి ఎంతో దూరంలో లేదని.. మరికొన్ని శతాబ్దాల్లోనే చూస్తామని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
అయితే జర్మన్ పరిశోధకులు గాలి ఉష్ణోగ్రత, సముద్ర లోతు, సముద్ర ఐస్, వర్షాలు, తేమ, మొక్కల వంటి వాటిని లెక్కలోకి తీసుకొని ఒక కాలుష్య మోడల్‌ను తయారుచేశారు. దాని ప్రకారం.. మనుషులు మరికొన్నేళ్లపాటూ.. భూతాపాన్ని పెంచుతూనే ఉంటారని తెలుసుకున్నారు. ఫలితంగా గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ డబుల్ అవుతుంది. కొన్నేళ్లలో భూమి లోపలి శిలాజ ఇంధనాలు అయిపోతాయి. అంటే.. చమురు, పెట్రోల్, డీజిల్, పెట్రోలియం వంటివి లభించవు అన్నమాట. దాని వల్ల భూమి చల్లబడుతుందని చాలా మంది అనుకుంటున్నారు. కానీ.. భూమి తీరు భిన్నంగా ఉంటుంది.
సో భూమి పై వచ్చే ఛేంజస్ కు వాతావరణం చాలా త్వరగా మారుతూ ఉంటుంది. కానీ మహాసముద్రం అలా కాదు నెమ్మదిగా స్పందిస్తుంది. అంటార్కిటికా సముద్రంలో మార్పులు వచ్చాయి. ఇంతకు ముందు భూమి లోతుల నుంచి చల్లని నీరు పైకి వచ్చేది. కానీ ఇప్పుడు రివర్సులో వేడి కిందకు వెళ్తోంది. దీంతో వేడి పెరుగడంతో ఐస్ కరుగుతూ వస్తుంది. ఫలితంగా అంటార్కిటికా కింద భారీగా వేడి స్టాక్ అవుతోంది. భూమిపై వేడి పెరుగుతూ ఉంటే.. దక్షిణ మహా సముద్రం మరింతగా ఆ వేడిని తన కింద దాచిపెడుతోంది.
భూమిపై వేడి తగ్గడం మొదలైనప్పుడు.. దక్షిణ మహా సముద్రం దాచిన వేడి.. తిరిగి వాతావరణం లోకి రావడం మొదలవుతుంది. దీన్ని ‘బర్ప్ ఫేజ్’ అని సైంటిస్టులు అంటున్నారు. అంటే.. సముద్రం.. కొన్ని శతాబ్దాలుగా దాచి ఉంచిన వేడిని.. ఒక్కసారిగా వదిలేస్తుంది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా మళ్లీ భారీగా భూతాపం పెరుగుతుంది. ఫలితంగా అన్నీ నష్టాలే ఉంటాయి. ఇలా వచ్చే వేడి.. వంద సంవత్సరాలకు పైగా కొనసాగే ప్రమాదం ఉంటుందని అంచనా వేస్తున్నారు సైంటిస్టులు.
ఈ వేడి ప్రభావం అన్ని ప్రాంతాలకూ ఒకే రకంగా వ్యాపించదు. దక్షిణార్థ గోళంపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తరచూ తుపాన్లు, వరదల్ని ఎదుర్కొనే దేశాలకు ఇది మరింత పెద్ద సమస్య అవుతుంది. ఆ దేశాలకు తుపాన్లు, ఫ్లాష్ ఫ్లడ్స్, పిడుగులు, క్లౌడ్ బరస్టుల వంటివి ఎక్కువగా పెరుగుతాయి. అయితే ఇండియా కూడా ఈ లిస్టులో ఉంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ.. ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. ఫలితంగా దక్షిణార్థ గోళం మళ్లీ వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుంటుందని సైంటిస్టులు చెబుతున్నమాట.
ఇక ఇప్పటివరకూ సైంటిస్టులు.. కార్బన్ డై ఆక్సైడ్ తక్కువగా ఉంటే.. భూమి చల్లగా ఉంటుంది అని భావిస్తూ వచ్చారు. కానీ అసలు విషయం మహా సముద్రాలతో ఉందని గుర్తించారు. సముద్రాల నుంచి వచ్చే సడెన్ వేడి మళ్లీ భూమికి డేంజర్ గా మారుతుందని అంటున్నారు. ఇక ఆ వేడి స్టోరేజ్ అవ్వడానికి కారణం మనుషులే అంటున్నారు. అందువల్ల మానవుల చర్యలే భూమికి సమస్యగా మారుతున్నాయంటున్నారు. సముద్రం నుంచి వేడి వస్తే ఆ తర్వాత భూమి తిరిగి సెట్ చేసుకుంటూ చల్లగా అయ్యేందుకు కొన్ని దశాబ్దాల టైమ్ పడుతుందనీ…సో అప్పటి వరకు భూమి నుంచి అనుకూల ఫలితాలు ఉండవని సైంటిస్టులు అంటున్నారు. Thermal Time Bomb.
‘సో మొత్తంగా సైంటిస్టులు చెప్పింది షాకింగ్ వార్తే అనుకోవాలి. మొత్తంగా సైంటిస్టులు చెప్పింది షాకింగ్ విషయమే. అంటార్కిటికా కింద ఒక థెర్మల్ టైమ్ బాంబ్ ఉన్నట్లు అది ఎప్పుడు పేలుతుందో తెలియదు. అది పేలినప్పుడు.. భూమిపై వేడి ఒక్కసారిగా పెరిగి.. వాతావరణం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందంటున్నారు. భూమిని కాపాడుతున్న అంటార్కిటికా తిరిగి అదే భూమికి ప్రళయంలా మారే రోజు భవిష్యత్తులో వస్తుందని సైంటిస్టులు అంటున్నారు.