
America China Deal: డొనాల్ట్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిలా కాకుండా.. బిజినెస్ పర్సన్ లా తయారయ్యారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డీల్స్, టారిఫ్స్ పైనే ఆయన ఫోకస్ ఉంటోంది. అలాగే అరుదైన ఖనిజాలను కూడా సొంతం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు చైనా వంతు రానే వచ్చింది. చైనా విషయంలోనూ అదే జరిగింది. అమెరికాతో చైనా డీల్ కుదుర్చుకుంది…. ఈ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య… దక్షిణ కొరియాలో శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఇది ప్రపంచ వాణిజ్య వ్యవస్థకు కొత్త ఆశలు కలిగించింది. ఈ సమావేశంలో రెండు దేశాలు ఒక సంవత్సరం వాణిజ్య ఒప్పందానికి అంగీకరించాయి. ట్రంప్, జిన్‌పింగ్‌ను “గొప్ప నాయకుడు” అని మెచ్చుకున్నారు. ఈ డీల్ ప్రకారం, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను చైనా పెద్ద మొత్తంలో కొంటుంది. అలాగే అమెరికాకి రేర్ ఎర్త్ మినరల్స్‌ని సప్లై చేస్తుంది. ఈ డీల్ తర్వాత ట్రంప్.. చైనాపై టారిఫ్‌లను తగ్గించారు. ప్రపంచ మార్కెట్లు ఈ ప్రకటనతో సానుకూలంగా స్పందించాయి. డౌ జోన్స్ ఇండెక్స్ 2% పైకి ఎగసింది. ఈ డీల్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే మొదటి అడుగు. ట్రంప్ ఈ సమావేశానికి 10కి 12 రేటింగ్ ఇచ్చారు.
చైనా, అమెరికా నుంచి NVIDIA చిప్‌ల సరఫరాను పెంచుకోవడానికి అంగీకరించింది. ఇది AI, సెమీకండక్టర్ రంగాల్లో సహకారానికి దారితీస్తుంది. ట్రంప్, “మేము ఒక గొప్ప డీల్ కుదుర్చుకున్నాం” అని చెప్పారు. జిన్‌పింగ్ కూడా ఈ సమావేశాన్ని “గొప్పది”గా అభివర్ణించారు. ఈ అంగీకారం గత రెండేళ్ల వాణిజ్య యుద్ధాన్ని ఆపేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ డీల్ ఒక సంవ0త్సరం మాత్రమే చెల్లుబాటులో ఉంటుందని, ఆ తర్వాత పొడిగించవచ్చని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఈ అంగీకారం గ్లోబల్ సప్లై చైన్‌లను స్థిరపరుస్తుంది. భారత్, యూరప్ దేశాలు ఈ డీల్‌ను స్వాగతిస్తున్నాయనే చెప్పుకోవాలీ. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి సానుకూల సంకేతం.
అణు ఆయుధాల పరీక్షలను పునఃప్రారంభించాలని పెంటగాన్‌కు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. 1992 తర్వాత మొదటిసారి అమెరికా మళ్లీ అణు పరీక్షలు జరపబోతోంది. “మేము రష్యా, చైనా లెవెల్‌కు అణు ఆయుధాల్ని పెంచుకుంటాం” అని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన ప్రపంచ దేశాల్లో కలకలం రేపింది. ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ ఈ నిర్ణయాన్ని ఖండించాయి. ఇది అణ్వాయుధాల తయారీని ప్రోత్సహిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ఈ ప్రకటనను చైనా సమావేశం తర్వాత చేశారు. దీనికీ, డీల్‌కీ సంబంధం లేదని చెప్పారు. అయితే, ఇది గ్లోబల్ భద్రతకు ముప్పుగా మారనుందని విమర్శకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రకటనతో అమెరికా అంతర్గత రాజకీయాల్లో కూడా వివాదాలకు దారితీసింది.
ఈ అణు ప్రకటన ప్రపంచ అణు నియంత్రణ ఒప్పందాలను దెబ్బతీస్తుందని ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా దగ్గర అత్యధిక అణు ఆయుధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. SIPRI డేటా ప్రకారం రష్యా దగ్గర 5,500కి పైగా ఉన్నాయి. ఈ పరీక్షలు రసాయనిక పర్యావరణానికి హాని కలిగిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చైనా, ఈ ప్రకటనకు స్పందిస్తూ.. తమ అణు సామర్థ్యాన్ని రక్షించుకుంటామని హెచ్చరించింది. ఇది కొత్త అణు ఆర్మ్స్ రేస్‌కు దారితీస్తుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. యూఎన్ సెక్రటరీ జెనరల్ ఈ నిర్ణయాన్ని “ప్రమాదకరం”గా అభివర్ణించారు. ఈ ప్రకటన.. ట్రంప్ “అమెరికా ఫస్ట్” విధానానికి సంబంధించినదని ఆయన చెప్పారు. అయితే, డెమోక్రటిక్ పార్టీ దీనిని “అజ్ఞానం”గా విమర్శించింది.
వాణిజ్య డీల్ విషయంలో, రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరా కీలకం. చైనా ప్రపంచంలో 80శాతం రేర్ ఎర్త్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఈ డీల్ ప్రకారం, అమెరికా ఇండస్ట్రీలకు అరుదైన ఖనిజాల సప్లై స్థిరంగా ఉంటుంది. ఇది ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ రంగాల్లో సహాయపడుతుంది. ట్రంప్, ఈ అంగీకారాన్ని “విన్-విన్”గా పిలిచారు. చైనా వ్యవసాయ ఎగుమతులు పెరిగి, అమెరికా రైతులకు లాభం జరుగుతుంది. అయితే, కొన్ని కీలక వివరాలపై ఇంకా ఏమి క్లారిటీ రాలేదు. పొలిటికో రిపోర్ట్ ప్రకారం, టారిఫ్ తగ్గింపు మొత్తం స్పష్టం కాలేదు. ఈ డీల్ భారతదేశానికి కూడా అవకాశాలు తెరుస్తుంది. భారత్ రేర్ ఎర్త్‌ల ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. గ్లోబల్ ఎకానమీకి ఈ డీల్ స్థిరత్వాన్ని ఇస్తుందని ఎకనామిస్టులు చెబుతున్నారు.
అణు ప్రకటనకు సంబంధించి, రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం, ట్రంప్ “తక్షణం” పరీక్షలు ప్రారంభించాలని పెంటగాన్‌ని ఆదేశించారు. ఇది అణు పేలుళ్లకు దారితీస్తుంది. ఇది 30 సంవత్సరాల అణు శాంతిని భంగపరుస్తుంది. ట్రంప్ అణు సంఖ్యల గురించి తప్పుగా చెప్పారని అనుకుంటున్నారు. ఈ నిర్ణయం చైనా, రష్యాతో ఉద్రిక్తతలను పెంచుతుందనే అనుకోవాలి. ఈ ప్రకటనను “ప్రమాదకరం”గా డెమాక్రసీ నౌ విమర్శించింది. ఆర్మ్స్ కంట్రోల్ నిపుణులు దేశ భద్రతకు ముప్పుగా చెప్పారు. ఈ ప్రకటన ట్రంప్ రక్షణ బడ్జెట్ పెంపుకి సంబంధించినది. 2026 ఆర్థిక సంవత్సరానికి 27శాతం పెంపు ప్రతిపాదించారు.
ప్రపంచ దేశాలు ఈ అణు ప్రకటనకు ఏకముఖంగా వ్యతిరేకిస్తున్నాయి. ఫ్రాన్స్, బ్రిటన్.. తమ అణు విధానాల్ని మళ్లీ పరిశీలించుకోవాలని అనుకుంటున్నాయి. భారత్ కూడా తన అణు సామర్థ్యాన్ని మరింత బలంగా చెయ్యాలనుకుంటోంది. ట్రంప్ ప్రకటనకి, అమెరికా ఎనర్జీ పాలసీలతో లింక్ ఉంది. అణు రియాక్టర్ల ద్వారా ఎనర్జీ ఉత్పత్తిని పెంచాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే.. పర్యావరణ గ్రూపులు ఈ పరీక్షల్ని వ్యతిరేకిస్తున్నాయి.
చైనాతో వాణిజ్య డీల్‌ని ట్రంప్ బాగా ప్రచారం చేసుకోవడం పక్కానే. చైనా, తమ ఎకానమీని రక్షించుకోవడానికి ఈ డీల్‌ను ఉపయోగిస్తుంది. అమెరికా రైతులు సంతోషిస్తున్నారు. ఎందుకంటే వారి ఉత్పత్తులను చైనా కొనబోతోంది. ఈ డీల్ గ్లోబల్ GDPకి 1% పెంపు తేవచ్చు అంటున్నారు. మరోవైపు ట్రంప్ అణ్వాయుధ ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో అత్యధిక అణు ఆయుధాలు ఉన్న టాప్ 5 దేశాలను గమనిస్తే.. . రష్యా – 5,580+ వార్‌హెడ్‌లు, అమెరికా – 5,044 వార్‌హెడ్‌లు, చైనా – 600+ వార్‌హెడ్‌లు, . ఫ్రాన్స్ – 290 వార్‌హెడ్‌లు, . యునైటెడ్ కింగ్‌డమ్ – 225 వార్‌హెడ్‌లు కలిగివున్నాయని సమాచారం. America China Deal.
ఈ భేటీతో తాత్కాలిక ఉద్రిక్తత తగ్గినప్పటికీ, పూర్తి వాణిజ్య ఒప్పందానికి మార్గం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా వచ్చే ఏడాది చైనాపై వాణిజ్య విధానాల్లో సడలింపు ఇచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు ఈ సమావేశం ద్వారా వెలుగులోకి వచ్చాయి.