
Dragon nation Hyper Sonic missiles: చైనా తయారు చేసిన అత్యాధునిక హైపర్ సోనిక్ మిసైల్స్ ఫోటోలు లీక్ అయ్యాయి. ప్రతీ విషయంలో ఎంతో సీక్రెసీ పాటించే చైనా.. ఈ కొత్త ఆయుధాల ఫోటోల లీక్ ను లైట్ తీసుకుంది. అదేంటి ఇంత సెన్సిటివ్ విషయంలో చైనా ఎందుకు అంత అలక్ష్యంగా ఉంది..? ఇది కావాలని చేసిన లీక్ నా..? అసలు చైనా ప్రపంచానికి ఏం చెప్పాలని అనుకుంటోంది..? వచ్చే నెలలో బీజింగ్ లో జరిగే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న వేడుకల్లో చైనా ఏం ప్రదర్శించనుంది..? ఓ శక్తివంతమైన మెసేజ్ చైనా ఇవ్వనుందా..? అసలు చైనా మనస్సులో ఏముంది..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 80వ ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనాలోని బీజింగ్ లో సెప్టెంబర్ 3న భారీ స్థాయిలో వేడుకల నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా భారీ సైనిక కవాతు కూడా ఉండనుంది. చైనా ఈ సైనిక కవాతు ద్వారా తన సైన్యం శక్తిని, ఆధునిక ఆయుధాలను ప్రపంచానికి చూపించాలని చూస్తోంది. తమ సైన్యం ఆధునిక యుద్ధంలో గెలిచే సామర్థ్యాన్ని ఈ కవాతు స్పష్టంగా చూపిస్తుందని చైనా ఆర్మీ అధికారులు చెబుతున్నారంటే.. ఎదో కొత్త ఆయుధాన్ని చైనా ప్రపంచం ముందుకు తీసుకురానుందని తెలుస్తోంది. వందలాది యుద్ధ విమానాలు, బాంబర్లు, హైపర్సోనిక్ మిస్సైళ్లు ఈ కవాతులో కనిపిస్తాయని అంటున్నారు. అయితే ఈ కవాతులో చాలా ముఖ్యమైన ఆయుధాలు మొదటిసారి కనిపించనున్నాయని తెలుస్తోంది. అయితే కవాతుకంటే ముందే కొన్ని ఆయుధాల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే చైనా ఈ విషయాన్ని లైట్ గా తసుకుంది.. ఎందుకంటే తమ శక్తి అందరికీ తెలియాలని చైనా అనుకుంటోంది.
పరేడ్ లో చైనా చూపించబోయే ఆయుధాలు ఎంతో అత్యాధునికమైనవి అంటున్నారు. YJ-15, YJ-17, YJ-19, YJ-20 అనే యాంటీ-షిప్ మిస్సైళ్లను ఇటీవల చైనా అభివృద్ధి చేసింది. వీటిలో YJ-17ని వేవ్‌రైడర్ అంటారు. ఇది ఒక హైపర్సోనిక్ రాకెట్. అలాగే YJ-19 స్క్రామ్‌జెట్ ఇంజన్ అంటే అత్యంత వేగవంతమైన ఇంజన్ తో తయారైంది. ఇవి సాధారణ రక్షణ వ్యవస్థలను దాటి శత్రు ఓడలను ఖచ్చితంగా నాశనం చేయగలవు. అంతేకాదు, 60 అడుగుల పొడవైన నీటి కింద పనిచేసే రోబోట్ వాహనాలు, స్టెల్త్ డ్రోన్స్ , కౌంటర్-డ్రోన్ సిస్టమ్స్ కూడా మొదటిసారి చైనా వెలుగులోకి తీసుకురాబోతోంది. ఈ ఆయుధాలు ఆధునిక యుద్ధంలో చైనా సామర్థ్యాన్ని బలంగా చాటుతాయి.
చైనా సైన్యం ప్రపంచంలోనే అతిపెద్దది, 20 లక్షలకు పైగా సైనికులతో బలంగా ఉంది. 2025లో చైనా తన రక్షణ బడ్జెట్‌ను 7.2% పెంచింది, అయినప్పటికీ అమెరికా రక్షణ బడ్జెట్‌తో పోలిస్తే ఇది రెండో స్థానంలో ఉంది. అయితే ఈ పరేడ్ లో చూపించే ఆయుధాలతో చైనా పశ్చిమ దేశాలకు గట్టి మెసేజ్ ఇవ్వాలని భావిస్తోందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా అమెరికాకు తమ ఆయుధాల సత్తా ఏంటో తెలిసేలా చేయాలని చైనా భావిస్తోంది. చైనా తయారు చేసిన మిస్సైల్స్ లో చాలా వరకు కొత్తవే ఉన్నాయి.
చైనాలో జరిగే పరేడ్ అమెరికాకు, దాని మిత్ర దేశాలకు ఒక హెచ్చరిక అని భావిస్తున్నారు. చైనా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని పెంచాలని, తైవాన్ సమస్య, దక్షిణ చైనా సముద్రంలో తన హక్కులను బలంగా చెప్పాలని చూస్తోంది. YJ-17, YJ-19 వంటి యాంటీ-షిప్ మిస్సైళ్లు అమెరికా యుద్ధ నౌకలను, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను లక్ష్యంగా చేసుకోగలవు, ఇవి ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా నావల్ శక్తికి సవాల్ విసురుతాయి. అలాగే, నీటి కింద పనిచేసే రోబోట్ వాహనాలు అమెరికా సముద్ర రక్షణ వ్యవస్థలను దాటగలవని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఈ ఆయుధాలను క్షణంగా గమనిస్తున్నాయి, ఎందుకంటే ఇవి భవిష్యత్ యుద్ధాలలో పెద్ద మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఈ పరేడ్ కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా పలు దేశాల నాయకులు హాజరవుతున్నారు, ఇది చైనా-రష్యా మైత్రిని మరింత బలపరుస్తుంది. 2015లో జరిగిన కవాతులోనూ పుతిన్ హాజరైన సంగతి తెలిసిందే. అమెరికా, యూరోపియన్ దేశాల నాయకులు ఈ కవాతుకు రాకపోవచ్చు, కానీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ తర్వాత బ్రెజిల్, సెర్బియా, వియత్నాం వంటి దేశాల నాయకులు బీజింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 3న జరిగే ఈ కవాతులో 40,000 మంది సైనికులు పాల్గొననున్నారు. వందలాది విమానాలు, ట్యాంకులు, డ్రోన్స్‌తో ఈ కవాతు ఇప్పటి వరకు నిర్వహించిన వాటిలో అతిపెద్దదిగా నిలుస్తుందని భావిస్తున్నారు. దీని కోసం బీజింగ్‌లో ఇప్పటి నుంచే భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కొత్త రకం మిస్సైల్స్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడం చర్చనీయాంశమైంది.
చైనా తన ఆధునిక టెక్నాలజీని, సైనిక శక్తిని ప్రపంచానికి చాటాలనుకుంటోంది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం, తైవాన్ సమస్య, దక్షిణ చైనా సముద్రంలో వివాదాల నేపథ్యంలో ఈ పరేడ్ ఒక పవర్ షోగా మారనుంది. తమ జోలికి వస్తే తమ అత్యాధునిక ఆయుధాలతో ఎంతటి వారినైనా మట్టికరిపిస్తామనే మెసేజ్ ను చైనా ఇవ్వనుంది. అంతుకే సోషల్ మీడియాలో కొత్త మిసైల్స్ ఫోటోలు లీక్ అయినా లైట్ తీసుకుంది. Dragon nation Hyper Sonic missiles.
ఈ సైనిక కవాతు కేవలం చారిత్రక వేడుక కాదు, భవిష్యత్ యుద్ధాలకు చైనా సన్నద్ధతను చాటే వేదిక అవుతుందని అంటున్నారు. హైపర్సోనిక్ మిస్సైళ్లు, డ్రోన్ టెక్నాలజీ, నీటి కింద పనిచేసే రోబోట్ వాహనాలు అంతర్జాతీయ సైనిక శక్తి లెక్కలను మార్చగలవు. అమెరికా, దాని మిత్ర దేశాలకు ఇది ఒక హెచ్చరిక సందేశంగా, చైనా ఆసియాలో తన ఆధిపత్య లక్ష్యాలను స్పష్టం చేసే ప్రదర్శనగా ఉండనుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సైనిక సమతుల్యతకు ఈ కవాతు కొత్త అధ్యాయాన్ని రాయనుంది, ఇది ప్రపంచ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q