జెన్ -Z తో వణుకుతున్న దేశాలివే..?

Spread the love

Gen z Protests: మొన్న నేపాల్, బంగ్లాదేశ్.. నిన్న మొరాకో,మడగాస్కర్ ఇప్పుడు భగ్గుమన్న పెరూ. ఎటుచూసిన జెన్ -Z . పాలకులను పరిగెత్తిస్తున్న యూత్. ఇంతకీ తిరుగుబాట్లకు కారణాలు ఏంటి..? జన్ – జీ అంటే ఏంటి..? ప్రపంచ దేశాలకు ఈ ఉద్యమం విస్తరిస్తోందా..? ఈ పేరు వింటే కొన్ని దేశాలు ఎందుకు వణుకుతున్నాయి.

జెన్ – జీ పాలకులపై డిజిటల్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. పలు దేశాల ప్రభుత్వాలను షేక్ చేస్తోంది. యువత నేతృత్వంలో మొదలైన ఉద్యమాలు యువత నేతృత్వంలో ఉప్పెనలా మారుతున్నాయి. మొన్నటి దాక మొరాకో, వడగాస్కెర్లను కుదిపేసిన జెన్ -జీ ఇప్పుడు పెరూ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే జన్ – జీ ఈ మధ్యకాలంలో కనివిని ఎరుగని భారీ నిరసనలను ఆవిష్కరిస్తోంది. పిలిప్పిన్స్, ఇండోనేషియా, మొరాకో,పెరూలోనూ ఉద్యమం ఉపందుకుంది. పెరూలో జెన్ -Z ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. అలర్లలో ఒకరు చనిపోగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. పెరూ రాజధాని లిమాలో విద్యార్థులు, వర్కర్లు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. విధ్వంసాలకు తెగబడ్డారు. టైర్లకు నిప్పు పెట్టారు. రంగంలోకి దిగిన భద్రత దళాలు..ఆందోళనకారులను అదుపు చేయ్యడానికి నానా కష్టాలు పడ్డాయి. టీయర్ గ్యాస్ ప్రయోగించారు. ప్రభుత్వానికి జవాబుదారి తనం ఉండాలని..సంస్కరణలు అమలు చేయ్యాలని నిరసన కారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో లిమాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పెరూలో అధ్యక్షురాలు దీనా బోలువార్టే నాయకత్వంలోని ప్రభుత్వం అవినీతి, నేరాలు, ఆర్థిక అస్థిరతలతో పునారిల్లుతుంది.

2022 లో ఆమె అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. నిరసకారులు హత్యలు దహన కాండలు కొనసాగుతున్నాయి. కొత్త పెన్షన్ చట్టంలో సంస్కరణలు యువతను వీధుల్లోకి రప్పించాయి. అవినీతి, నేరాలపై ఆగ్రహా జల్వలు తిరుగుబాటుగా మారాయి. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిన పెరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన్ – జీ పోరుబాట పట్టింది. ఈస్ట్ ఆఫ్రికా దేశామైన మడగాస్కర్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. కొన్ని రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన్ -జీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోని ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా దేశం విడిచి పారిపోయారు. దీంతో దేశాన్ని ఆధీనంలోకి తీసుకున్నట్లు మడగాస్కర్ సైన్యం ప్రకటించింది. మిలటరీ కమాండర్ కల్నల్ మైఖేల్ జాతీయ రేడియోలో ఈ ప్రకటన చేశారు. దేశ సాయుధ దళాలు అధికారాన్ని చేజిక్కించుకున్నాయని స్పష్టం చేశారు. పార్లమెంట్ దిగువ సభ మినహ అన్ని సభలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. సైన్యం శాంతి భద్రతల దళం. అధికారులతో కూడిన ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి.. పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ్యడానికి త్వరగా ప్రధానమంత్రిని నియమిస్తామన్నారు.

సైనిక తిరుగుబాటు తర్వాత తన ప్రాణానానికి ప్రమాదం ఉందని.. అందుకే దేశం విడిచి పారిపోయానని రాజోలినా ఓ టెలివిజన్ ప్రసంగంలో చెప్పారు. దేశం ప్రస్తుతం పరిస్థితులను పరిష్కారించేందుకు చర్చలు జరపాలి. రాజ్యంగాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు. మడగాస్కర్ లోని మూడు కోట్ల మంది జనాభాలో దాదాపు మూడోంతుల మంది దాదాపు పేదరికంలో జీవిస్తున్నారు. జీడీపీ సైతం బాగా తగ్గిపోయింది. అంతేకాదు దేశంలో నీరు, విద్యుత్ కొరత వేధిస్తోంది. దీంతో గత నెల 25న నిరసనలు మొదలయ్యాయి. ఈ సమస్యలను ప్రెసిడెంట్ రాజోలినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. భారీగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఈ ఉద్యమానికి యువత జన్ -జీ మడగాస్కర్ అని పేరు పెట్టారు. రాజోలినా రాజీనామాకు డిమాండ్ చేశారు. సైన్యం సైతం నిరసన కారులకు మద్దతు తెలిపి ఆందోళనలు ఉధృతం కావడంతో రాజోలినా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.

మడగాస్కర్ అధ్యక్షుడు రాజోలినా సారథ్యంలోని ప్రభుత్వాన్ని కూలగొట్టిన మిలటరీ కమాండర్ కల్నల్ తన మనసులోని మాటను బయటపెట్టారు. త్వరలో దేశ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్నట్లు చెప్పాలి. రాజోలినా పారిపోవడంతో.. దేశంలోని అత్యున్నత న్యాయ స్థానం ఆహ్వానం మేరకు త్వరలో తాను దేశ అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్నట్లు చెప్పారు. మైఖేల్ సారథ్యంలోని నిపుణులైన సైనిక బృందం తిరుగుబాటు చేపట్టడంతో.. రాజోలినా చేతులెత్తేశారు. ఎప్పటిలోగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనే మైఖేల్ క్లారిటీ ఇవ్వలేదు. న్యాయస్థానం, ఈసీ అధికారులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే మైఖేల్ ప్రకటించారు. 1960 లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందాక మడగాస్కర్ ఎన్నో తిరుగుబాట్లు ఎదుర్కోంది.

దేశంలో తిరుగుబాట్లు, నిరుద్యోగం పేదరికం పెచ్చరిల్లడం, ప్రజల జీవన వ్యయాలు పెరగడం, నీటి కొరత, విద్యుత్ సంక్షోభం అమాంతం పెరిగిన అవినీతితో జన్ – జెడ్ యువత విసిగిపోయి ఉద్యమబాట పట్టడం, దీనికి సైనిక తిరుగుబాటు తొడవ్వడంతో.. రాజోలినా ప్రభుత్వం కూలిపోయింది. ఆశ్చర్యకంగా నిరసనలను అణచివేయ్యడానికి సైనికులు.. తాము ప్రజలకు మద్దతు ఉన్నామని ప్రకటిస్తూ.. తిరుగుబాటుకు మద్దతు పలికారు. 2009 లో రాజోలినా అప్పటి దేశాధ్యక్షుడి పదవి నుంచి దింపి.. అధికారంలోకి రావడానికి సపోర్ట్ చేసిన కేప్స్ ఆర్ట్ అనే ఆర్మీ యూనిట్ ఇప్పుడు జన్ – జీ యువతకు అండగా నిలిచింది. మొరాకోలో జెన్ 212 ఉద్యమం విద్య,వైద్య వ్యవస్థలో దయనీయ దుస్థితిని ఎండగట్టింది. ఒకవైపు 2030 ప్రపంచ కప్ కోసం వేల కోట్ల రూపాయాలు దారపోస్తూ.. మరో వైపు ఆస్పత్రుల్లో గర్భీణి స్త్రీల మరణాలను నిర్లక్ష్యం చేయ్యడాన్ని జన్ – జెడ్ ప్రశ్నిస్తోంది. ప్రభుత్వాధికారులు రాజీనామాతో వీధుల్లోకి వచ్చింది. ముగ్గురు మరణించిన ఇంకా ఉద్యమం కొనసాగుతునే ఉంది.

జన్ -జీ మాట వినిపిస్తే చాలు.. ప్రపంచంలోని పలు దేశాల్లో దడ పుడుతోంది. దక్షిణాసియాలో ఏడాది వ్యవధిలో రెండు ప్రభుత్వాలను కూల్చేసింది. నేపాల్,బంగ్లాదేశ్ నిరసనల ప్రేరణాలతో ఆందోళనలు హోరేత్తాయి. ఈ ఉద్యమాల్లో విద్యార్థులు యువత కీలక పాత్ర పోషించాయి. ఏ ఏ దేశాల్లో ఎవరెవరు జన్ – జీని లీడ్ చేశారు.

బంగ్లాదేశ్, మడగాస్కర్, నేపాల్,మొరాకో ఈ పేర్లు వించే ప్రపంచంలో కొన్ని దేశాలు వణికిపోతున్నాయి. ఎక్కడ జన్ – జెడ్ ఉద్యమం తమ దేశంలో మొదలవుతుందో అని టెన్షన్ పడుతున్నాయి. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాలు, ప్రజల సమస్యలను పట్టించుకోని అధ్యక్షులకు కంటి మీద కునుకు ఉండడం లేదు. సోషల్ మీడియాకు ముందు, సోషల్ మీడియాకు తర్వాత అన్నట్లు పరిస్థితి తయారైంది. ఏమాత్రం తేడా వచ్చిన జన్ – జెడ్ ప్రశ్నిస్తోంది. ఆన్ లైన్ పోస్టులతో ప్రకంపనలు సృష్టిస్తోంది. రోజుల వ్యవధిలోనే లక్షలాది మంది యువత రోడ్లపైకి వచ్చేలా చేస్తోంది. అందుకే ఈ పేరు వింటేనే కొన్ని దేశాలు కంగారు పడుతున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్ కెన్యాలలో మొదలైన ఈ ఉద్యమాలు నేపాల్, మొరాకో, మడగాస్కర్, పెరూ దేశాలకు పాకాయి. సిలిప్పిన్స్ రాజధాని మనీలాలో ఇటీవల వేలాదిమంది యువకులు ఆందోళనకు దిగారు. పాలకుల అవినీతికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు.

ఇండోనేషియాలో సైతం విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతి దేశాభివృద్ధిని దెబ్బతిస్తుందని ఆగ్రహాంతో నిరసన తెలిపింది. ఉద్యోగ అవకాశాలు లేవని.. వేరే దేశాలకు వెళ్లి ఉపాధిని పొందాలని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టింది. ఓ స్థానిక పాలకుడికి నేలకు వచ్చే అద్దె అలవెన్స్ ఓ సామాన్య కుటుంబీకుడికున్న ఆదాయం కన్న 20 రేట్లు ఎక్కువగా ఉందన్న ప్రచారంతో.. ఓ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. యవతలో రాజుకుంటున్న అసంతృప్తికి ఇదే నిదర్శనం. దక్షిణాసియాలో రెండు ప్రభుత్వాలను కూల్చింది జెన్ -జెడ్. తిరుగుబాటుతో జనరేషన్ జెడ్ నేపాల్ ను షేక్ చేసింది. దేశ వ్యాప్తంగా జరిగిన నిరసనలతో.. ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేయ్యాల్సి వచ్చింది. ఇదే తరహాలో బంగ్లాదేశ్ లో యువత నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు కారణంగా ప్రధాని షేక్ హాసీనా పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఒక్క ఏడాదిలోనే జెన్ -జెడ్ రెండు ప్రభుత్వాలను కూకటి వేళ్లతో సహ కూల్చివేసింది.

నేపాల్ లో పలు సోషల్ మీడియా యాప్ ల నిషేధంతో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ పరిణామాలతో ప్రధాని కేపీ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. 2024 ఆగష్టులో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హాసీనా కూడా ఇంటువంటి పరిణామాలతో రాజీనామా చేశారు. అంతేకాకుండా వీళ్లు దేశ విడిచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటు బంగ్లాదేశ్, ఇటు నేపాల్ లలో వచ్చిన మార్పులు దక్షిణాసియాలో తరాల మార్పులను గుర్తించేలా చేశాయి. జనరేషన్ జెడ్ ఉద్యమాల్లో దేశాధినేతలను నిష్క్రమించేలా ఒత్తిడి పెట్టాయి. సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా వేలాదిమంది జెన్ -జీ నిరసనకారులు ఘాట్ మండ్ వీధుల్లో నిరసనలకు దిగారు. బంగ్లాదేశ్ లో జరిగిన రిజర్వేషన్ కోటా నిరసనలు ఆ దేశంలో సంక్షోభం తలెత్తెలా చేశాయి. స్వాతంత్ర్య సమరయోధులకు అనుకూలంగా ఉన్న రిజర్వేషన్ ల వ్యవస్థపై విద్యార్థులు ఆగ్రహం పెల్లుబికింది. అది షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చే వేసేవరకు సాగింది.

సోషల్ మీడియాకు వ్యతిరేకంగా నేపాలో మొదలైన ఉద్యమం రాజకీయా నాయకుల అవినీతిని నిలదీసే ఉద్యమానికి దారితీసింది. అటు బంగ్లాదేశ్ ఇటు నేపాల్ ఇరు దేశాల నిరసనల్లో విద్యార్థులు, యువత కీలక భాగస్వామ్యం వహించారు. కాలం చెల్లిన రాచరిక పాలనకు అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా వాడుకున్నారు. ఢకా, ఘట్మండ్ రెండు చోట్ల ఉద్యమాల అణిచివేతకు ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాల్లో అనేకమంది ప్రజలు మృత్యువాత పడ్డారు. దీంతో ఉద్యమాలు మరింత తీవ్రమయ్యాయి. దేశ నాయకత్వం మార్పు అనివార్యం అయ్యే పరిస్థితి ఏర్పడింది. నాటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హాసీనా 2024 ఆగష్టులో పదవిని వదిలి భారత్ కు వచ్చారు. ఆ తర్వాత నేపాల్ ప్రధాని ఆ దేశంలోని పరిణామాల దృష్ట్యా దుబాయ్ పారిపోయారు. ఏడాది వ్యవధిలో రెండు దేశాలు దక్షిణాసియా అంతా తరాల మార్పు సూచిస్తుందనే పరిశీలకుల మాట. ఈ పరిణామాలతో ఇప్పటి నేతలు అవినీతి రహిత నాయకులకు పట్టం కట్టాలని చూస్తున్నారనడంలో ఎలాంటి సందేహాం లేదు.

నేపాల్ నిరసనల్లో ఎక్కువగా పాల్గొన్న వారు విద్యార్థులే. వెంటనే సోషల్ మీడియా వార్ ను ఎత్తివేయ్యాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితి వేడెక్కడంతో కొంతమంది పార్లమెంట్ భవనంలోకి దూసుకెళ్లారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు, జలఫిరంగులు,బాష్పావాయు గోళాలు ప్రయోగించారు. చివరికి కాల్పులు జరిపే స్థితి ఏర్పడింది. దీంతో ఆందోళనలు ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. ఫలితంగా కర్ప్యూ అమలు చేయ్యాల్సి వచ్చింది. ఈ ఆందోళనలతోపాటు మరొ కొత్త తరహ మరో కొత్త తరహ ఉద్యమం కూడా ఊపందుకోవాల్సి వచ్చింది. రాజకీయ నాయకులు పిల్లలు , ధనవంతుల వారసులు అవినీతి సొమ్ముతో సుఖాలు అనభవిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనలు చేపట్టారు. నేపో కిడ్ ఉద్యమంగా పిలిచారు. నేపాల్ లో మొదట సోషల్ మీడియా పై ప్రారంభించిన ఉద్యమం అసాధారణ రీతిలో రాజకీయ విప్లవంగా మారింది. కేవలం 48 గంటల్లోనే ప్రధానమంత్రిని గద్దె దించి ఏకంగా పార్లమెంట్ ను దహనం చేసేదాక దారితీసింది. ప్రభుత్వాన్ని దించేసి ప్రపంచ రాజకీయాల్లో కొత్త చరిత్రను రాసింది. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా, శ్రీలంకలో ప్రభుత్వాన్ని పడగొట్టిన ఘటనలో ఈ తరం ఎంత శక్తివంతమైందో నిరూపిస్తోంది. అవినీతి, ఆర్ధిక సంక్షోభం, అణచివేతలపై ఈ తిరుగుబాటు పాలక

ఇంతకీ ఈ జన్ – జీ అంటే ఏంటి..? కేవలం సోషల్ మీడియాలోనే ఈ ఉద్యమాలను ఎలా ప్లాన్ చేస్తోంది..? ఏ రాజకీయ పార్టీకి తలొగ్గకుండా పోరాటాన్ని ఎలా ముందుకు వెళ్తోంది. యూత్ తలుచుకుంటే అధికార పీఠాలు కదులుతాయని సవాల్ విసురుతుందా..? ఇది ప్రపంచమంతా విస్తరించబోతోందా..?

జన్ జడ్ -జీ అంటే ఇంగ్లీష్ లో జనరేషన్ జీ అంటారు. అంటే 1990 నుంచి 2010 మధ్య పుట్టినవారు అని అర్ధం. ప్రపంచంలో ఇంటర్నేట్ వాడకం కూడా అప్పుడే ప్రారంభమైంది. ఈ తరం సామాజిక న్యాయం, ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలని కోరుకుంటుంది. పలు దేశాల్లో జరిగిన ఆందోళనల్లో జెన్ జెడ్ దే కీలక పాత్ర. స్మార్ట్ ఫోన్ లో ఎక్కువగా ఉపయోగించే ఇంటర్నేట్ యుగంలో జన్మించినవారే జన్ జెడ్ క్యాటగిరికి చెందిన వాళ్లు. వీరు ప్రపంచాన్ని డిఫారెంట్ గా చూస్తారు. ఆన్ లైన్ , నేరుగా ఫ్రెండ్స్ ను కలుసుకోవడానికి పెద్దగా తేడా లేదని అంటుంటారు. డిజిటల్ ప్రపంచమే జెన్ జెడ్ లోకం. 1995 తర్వాత అత్యంత వేగంగా సాంకేతికత పెరిగింది. స్మార్ట్ ఫోన్ లు, హై స్పీడ్ ఇంటర్నేట్ కనెక్షన్ లు విరివిరిగా అందుబాటులోకి వచ్చాయి. ఈ తరంలో పుట్టిన వాళ్లు.. సాంకేతికంగా ముందడుగు వేస్తారనేది నిపుణులు మాట. జనరేషన్ జెడ్ సంక్షిప్తంగా జెన్ జెడ్. వ్యూహాత్మకంగా జూమర్స్ అని ప్రస్తుత తరం యువతను పిలుస్తున్నారు. ఈ తరంలో జన్మించిన అంతకుముందు తరాల వారి వ్యవహారశైలికి భిన్నంగా ఉన్నారు.

జెన్ జెడ్ డిజిటల్ తరాన్ని అభివృద్ధి చేయ్యడంతోపాటు.. దాన్ని స్వీకరించిన మొదటి తరం. ఈ తరం డిజిటల్ ఫ్లాట్ ఫామ్.. సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటుంది. కరోనా కాలంలో లాక్ డౌన్ విధించిన సమయంలో మిగిలిన తరాల వారు ఎంత ఇబ్బందిపడిన.. జెన్ జెడ్ వర్గంవారు దాన్ని కష్టసమయంగా భావించలేదు. ఇంటర్నేట్ సహయంతో వారు అనేక విషయాలు తెలుసుకున్నారు. మిగిలిన తరాలకు భిన్నంగా ఆలోచిస్తూ.. జెన్ జెడ్ వర్గంవారు ముందు దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అవినీతి విషయంలో ప్రభుత్వ ఉద్యమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. జనరేషన్ జెడ్ కు సోషల్ మీడియానే ఆయుధంగా మారింది. మొరాకో లో జెడ్ 212 డిస్కార్డ్ సర్వర్ కొద్ది రోజుల్లోనే లక్ష 30వేల మందికి విస్తరించడం డిజిటల్ శక్తికి నిదర్శనం. Gen z Protests.

ఈ డిజిటల్ సాధనాలు ఏ ఒక్కరి నాయకత్వం లేకుండా వీకేంద్రీకృతంగా రన్ అవుతున్నాయి. అందుకే అధికారులు ఈ ఉద్యమాలను అణచివేయ్యాలేక చేతులెత్తేస్తున్నారు. మడగాస్కర్ లో జెడ్ మడ ఉద్యమం సంప్రదాయ సంఘాలతో కలిసిపోయి అధికార వర్గాలకు సవాల్ విసిరింది. ఈ డిజిటల్ శక్తి యువతను ప్రపంచ సరిహద్దులు దాటి ఒక్కటి చేస్తుంది. ఈ ఉద్యమం కేవలం తిరుగుబాటు కాదు.. ప్రపంచ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది అంటారు. ఇక నేపాల్ విషయానికి వస్తే.. సుదన్ గురుంగ్ నేతృత్వంలో నిర్వహించే హమి నేపాల్ అనే ఎన్జీవో సంస్థ ఆందోళనను ముందుండి నడిచింపింది. ఈ సంస్థకు సుదన్ ప్రెసిడెంట్ 2015లో నేపాల్‌లో భారీ భూకంపం వచ్చిన తరువాత హమి నేపాల్ అనే సంస్థను సుదన్ గురంగ్ స్థాపించాడు. అప్పటి విపత్తులో సుదన్ తన బిడ్డను కూడా కోల్పోయారు. ఈ సంఘటనతో ఈవెంట్ మేనేజర్ గా ఉన్న అతని ఆయన తన జీవితాన్ని ఎన్‌జిఒ వైపు మలుచుకున్నారు. భూకంపం తరువాత సహాయ, పౌరసేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. గతంలో బిపి కొయిరాల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పారదర్శకత కోరుతూ ఘోప క్యాంప్ పేరిట సుదన్ ఆందోళనలు సాగించారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల నిషేధంతో ప్రారంభమైన ఉద్యమాన్ని సరైన దిశలో నడిపించే నాయకత్వం ఆయనదే. శ్