48 గంటల డెడ్ లైన్..?

Spread the love

Pakistan Taliban Rule: ఆఫ్గానిస్తాన్- పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత కొసాగుతున్నాయి. దశాబ్దాల కాలం తర్వాత పాక్ – అఫ్గాన్ మధ్య జరిగిన అతి తీవ్రమైన ఘర్షణగా ఇది నిలించింది. 2021లో అఫ్గాన్ లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత పాక్ సరిహద్దు వెంబడి జరిగిన అతిపెద్ద ఘర్షణ ఇదే కావడంతో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టిని సైతం ఇది ఆకర్షించింది. అసలేం జరిగింది..? ఘర్షణ కు కారణమేంటి.. ? పాకిస్తాన్ – తాలిబాన్ ప్రస్థానం ఏంటి..?

పాకిస్తాన్ – తాలిబాన్ ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ.. దాడులకు తెగబడుతుండంతో.. అఫ్గనిస్థాన్, పాకిస్థాన్ ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. బుధవారం నాడు పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 15 మంది అఫ్గన్ పౌరులు చనిపోయారు. అలానే 100 మందికి పైగా గాయపడ్డారు. పాక్ చర్యలతో ఆగ్రహించిన తాలిబన్ సైన్యం ప్రతి చర్యలకు దిగడంతో.. పాకిస్థాన్ తోకముడిచింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆదివారం కూడా దాడులు కొనసాగాయి. ఈ కాల్పుల ఘటనలో 23 మంది సైనికులు మరణించినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. అటు తాలిబాన్ సైతం తొమ్మిది మంది యోధులను కోల్పోయినట్లు పేర్కొంది.

గత వారం పాకిస్తాన్ వైమానిక దళం.. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్పై వైమానిక దాడి చేసింది. పాకిస్తాన్ తాలిబాన్ వర్గాలు పేర్కొన్నాయి. అతను బతికున్నాడో లేదో స్పష్టంగా తెలియలేదని తెలియజేశాయి. అయితే తాలిబన్ ప్రభుత్వం మాత్రం ఈ దాడులను చాలా సీరియస్ గా తీసుకుంది. తమ దేశంపై జరిగిన వైమానిక దాడిగా అభివర్ణించింది. అఫ్గాన్ విదేశాంగ మంత్రి.. భారత్ లో పర్యటిస్తున్న సమయంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. దీంతో ఆయన భారత్ వేదికగానే పాకిస్థాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకు ప్రతిస్పందనగానే శనివారం రాత్రి పాక్ సరిహద్దుల వెంబడి అఫ్గాన్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి.

వాయవ్య పాకిస్తాన్లో కార్యకలాపాలు సాగిస్తున్న పశూన్ జాతికి చెందిన జిహాదీ గ్రూపులు అన్ని కలిసి 2007లో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్ర సంస్థను ఏర్పాటు చేశాయి. దీనిని పాకిస్థాన్ తాలిబన్ గా పిలవబడుతోంది. ఇది అఫ్గాన్ లోని తాలిబన్ల నుంచి ప్రేరణ పొందినప్పటికీ సిద్దాంతాల పరంగా అల్ ఖైదాను ఈ సంస్థ అనుసరించింది. పాకిస్థాన్ తాలిబన్.. కాలక్రమేణ మార్కెట్లు, మసీదులు, విమానాశ్రయాలు, సైనిక స్థావరాలు, పోలీసు స్టేషన్లపై దాడులు చేస్తూ వచ్చింది. తద్వారా సరిహద్దు ప్రాంతాలతో పాటు పాకిస్థాన్ అంతర్గత భూభాగంలోనూ దాడులకు తెగబడింది. 2014లో పేషావర్ లోని ఒక పాఠశాలపై దాడి చేసి.. 130 మందికి పైగా పిల్లలను టీటీపీ పొట్టన పెట్టుకుంది. దీంతో అప్పట్లో పాక్ భారీ ఎత్తున సైనిక ఆపరేషన్ చేపట్టింది. దీంతో టీటీపీ ఉగ్రవాదులు… పాక్ విడిచి పారిపోయారు. అయితే వీరికి అఫ్గాన్ తాలిబన్లు అండగా నిలుస్తూ.. పాక్ లో అశాంతిని ఎగదోస్తున్నారని దయాది దేశం ఆరోపిస్తోంది.

2021లో తాలిబాన్ ఆఫ్ఘానిస్తాన్లో అధికారంలోకి వచ్చినప్పుడు పాకిస్థాన్ సంతోషంగా స్వాగతించింది. అప్పటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ ఆఫ్గాన్లు బానిసత్వపు గొలుసులను తెంచుకున్నారని వ్యాఖ్యానించారు. అయితే తాలిబాన్ల పాలన పాకిస్థాన్ ఆశించినట్లు సాగలేదు. దీంతో పాక్ లో టీటీపీ దాడులు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిపోయాయి. తమ దేశంలో దాడికి వ్యూహరచన చేస్తున్న టీటీపీ నాయకత్వం, కీలక సభ్యులు అఫ్గాన్ లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్లు పాక్ ఆరోపిస్తోంది. వారిని నియంత్రించాలని

అఫ్గానిస్తాన్ తో కలిసి టీటీపీ, ఇతర మిలిటెంట్ గ్రూపులను పాకిస్థాన్ పైకి భారత్ ఎగదోస్తోందని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. పాక్ ఆరోపణల్లో ఏమాత్రం నిజంలేదని స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి.. భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ అఫ్గాన్ మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ఇరుదేశాలు మరింత దగ్గరవుతున్న క్రమంలో పాకిస్థాన్ లో కొత్త భయాలు పురుడుపోసుకుంటున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

పాక్ – అఫ్గాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతోందని విన్నానని ట్రంప్ అన్నారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యం పర్యటనలో ఉన్న ఆయన.. తిరిగి అమెరికాకు వెళ్లిన తర్వాత దాని గురించి చూస్తానని చెప్పారు. మీకు తెలుసా.. నేను మరో యుద్ధాన్ని కూడా పరిష్కరించబోతున్నాను. ఎందుకంటే యుద్ధాలు పరిష్కరించడంలో నేను బాగా నేర్పరని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఘర్షణల నేపథ్యలో ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదనే వాతావరణం ఏర్పడగా.. అనూహ్యంగా.. ఇరు వర్గాల మధ్య 48 గంటల పాటు కాల్పుల విరమణ ఒప్పందం తెర మీదకు వచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కొన్ని దృశ్యాలు పాకిస్థాన్ పిరికిపంద చర్యలను ప్రపంచానికి చూపాయి. తమ దాడికి తట్టుకులోక పాకిస్థాన్ సైనికులు ఆఖరికి ప్యాంట్లు కూడా విడిచి పారిపోయారంటూ ఎద్దేవా చేస్తున్నారు. Pakistan Taliban Rule.

పాకిస్థాన్.. కాబూల్, కాందహార్‌లపై దాడులు చేయడంతో.. అఫ్గన్ ప్రజలు తీవ్రంగా రగిలిపోతున్నారు. ఈక్రమంలో తాలిబన్ బలగాలు.. స్పిన్‌ బోల్దక్‌ దగ్గర ఉన్న పాక్‌ మిలిటరీ ఔట్‌ పోస్టులపై మెరుపు దాడులకు దిగాయి. దీంతో పాక్ సైనికులు పరారయ్యారని.. కొందరు పాక్ సైనికులను తాలిబన్ బలగాలు బంధించినట్లు సమాచారం. అలానే అవుట్‌పోస్టులపై దాడుల తర్వాత.. తాలిబన్ బలగాలు.. భారీగా ఆయుధాలు, పాక్ సైనికుల దుస్తులు, ఆహార పదార్థాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పాక్ సైనికుల ప్యాంట్లను.. నంగర్‌హార్ ప్రావిన్స్‌లో బహిరంగంగా ప్రదర్శించారు. పాక్ సైన్యానికి వ్యతిరేక నినాదాలు చేశారు. అయితే పాక్ దాడులను తీవ్రంగా తప్పు పడుతున్న అఫ్గన్‌ ప్రజలు.. తాలిబాన్లకు మద్దతుగా నిలిచారు. అవసరమైతే తాము కూడా ముజాహిదీన్‌గా మారిపోయి.. యుద్ధం రంగంలోకి దిగుతామని.. కాందహార్‌ యువకులు ప్రకటిస్తున్నారు. తాలిబన్ల చర్యల మీద పక్తియా ప్రజలు స్పందిస్తూ.. ఇస్లామిక్ ఎమిరేట్ పాకిస్థాన్ విషయంలో సరైన ప్రతీకారం తీర్చుకుంది. ప్రజలంతా పాకిస్తాన్‌ కు వ్యతిరేకంగా.. తాలిబాన్‌తో ఉన్నారు అని ప్రకటించారు. అలానే తమ భూమిని కాపాడిన తాలిబన్ల బలగాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సదా తాల