ఐసిస్ అగ్రకమాండర్ ను మట్టుబెటియినట్లు తెలిపిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్

Spread the love

ఐసిస్ (ISIS) కీలక కమాండర్ అయిన అబు-బిలాల్ అల్-మినుకిని మట్టుబెట్టినట్లు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ లో పోస్ట్ చేశారు. తన ఆదేశాల మేరకు, ఈ రాత్రి ధైర్యవంతులైన అమెరికన్ దళాలు మరియు నైజీరియా సాయుధ దళాలు ఉగ్రవాదిని యుద్ధరంగం నుండి మట్టుబెట్టడానికి అత్యంత సూక్ష్మంగా ప్రణాళికాబద్ధంగా, ఎంతో క్లిష్టమైన మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేశాయని తెలిపారు.  గ్లోబల్ ఐసిస్ (ISIS) డిప్యూటీ కమాండర్ అయిన అబు-బిలాల్ అల్-మినుకి, తాను ఆఫ్రికాలో దాక్కోవచ్చని అనుకున్నాడు, కానీ అతని ప్రతి కదలికను మాకు తెలియజేసే సమాచార వనరులు మాకు ఉన్నాయనే విషయం అతనికి తెలియదు. అతను ఇకపై ఆఫ్రికా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయలేడు, లేదా అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రణాళికలు వేయలేడని ట్రంప్ అన్నారు.  అతనిని మట్టుబెట్టడంతో ఐసిస్ ప్రపంచవ్యాప్త కార్యకలాపాలు చాలా వరకు బలహీనపడ్డాయని  ఈ ఆపరేషన్‌లో భాగస్వామ్యమైనందుకు నైజీరియా ప్రభుత్వానికి ట్రంప్ తన ధన్యవాదాలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *