జుట్టుకు రంగు వేసే విషయంలో జాగ్రత్త!

Spread the love

ఈరోజుల్లో హెయిర్ కలరింగ్ అనేది ఒక ఫ్యాషన్ ట్రెండ్‌గా మారిపోయింది. కొత్త లుక్ అండ్ స్టైలిష్ గా కనిపించడానికంటూ చాలామంది జుట్టుకు వివిధ రకాల రంగులను వేస్తున్నారు. ఇంతకుమునుపు తెల్ల జుట్టును కవర్ చేయడానికి జుట్టు రంగును ఉపయోగించేవారు. కానీ ఇప్పుడదే కొత్త ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మారింది. ఇలా పదే పదే జుట్టుకు రంగు వేయడం వల్ల జుట్టు బలహీనపడుతుందనే విషయం గ్రహించలేకపోతున్నాం. జుట్టుకు అధికంగా కలర్ వేయడం వల్ల జుట్టు పొడిబారి నిర్జీవంగా మారుతుంది. హెయిర్ కలర్ ని ఇలా పదే పదే వాడటం వల్ల ఎలాంటి హాని జరుగుతోందో ఇప్పుడు తెలుసుకుందాం:

హెయిర్ కలర్ ని పదే పదే వాడటం వల్ల, జుట్టు బలహీనపడి విరిగిపోతుంది. ఎందుకంటే అమ్మోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలు జుట్టు రంగులో మిక్స్ అయి ఉంటాయి. ఇవి జుట్టు నుంచి సహజ తేమను తొలగిస్తాయి. అంతేకాదు తలపై చర్మం చికాకుకు లోనవుతుంది. అలెర్జీలు వచ్చే ప్రమాదమూ ఉంది. కలర్ లోని రసాయనాలు చికాకు, దురద, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి.

జుట్టుకు రంగు వేసి, వాష్ చేయడం వల్ల అది రాలిపోతుంది. జుట్టు కూడా సన్నగా, పలుచగా మారుతుంది. రసాయన రంగులు తల చర్మంకు కావాల్సిన సహజ తేమ, పోషణను తొలగిస్తుంది. దీని కారణంగా జుట్టు పలుచనవుతుంది. మృదువుతనం తగ్గి మెరుపును కోల్పోతుంది. దీనివల్ల జుట్టు స్వభావం నిర్జీవంగా తయారవుతుంది. కాబట్టి వీటినుంచి బయటపడేందుకు సహజ క్లెన్సర్లను వాడొచ్చు. నేచురల్ పదార్ధాలతో కలర్ ను సిద్ధం చేసుకోవచ్చు. రెగ్యులర్ గా కొబ్బరినూనె తో మర్దన తప్పనిసరి. కుంకుడు కాయలు, శిక్కాయ, ఉసిరి వంటివి నేచురల్ క్లెన్సర్లా షాంపూలకు, హెయిర్ డైలకు రిప్లేసింగ్ గా పనిచేస్తాయి.