జొన్నరొట్టెలు తింటే షుగర్ తగ్గుతుందా..?!

Spread the love

మారిన లైఫ్ స్టైల్, ఆహారపుటలవాట్ల వల్ల చిన్న వయసులోనే చాలామంది మధుమేహం/ షుగర్ బారిన పడుతున్నారు. దీంతో ఈ దీర్ఘకాలిక వ్యాధిని అదుపులో ఉంచుకునేందుకు ఓవైపు మందులు వాడినా.. తినే విషయంలో తప్పక కొన్ని నియమాలు పాటించాలి అంటున్నారు ఆహార నిపుణులు. వాటిలో మనకు తెలిసిన, విన్న విషయం ఏంటంటే.. జొన్న రొట్టెలను తినడం. అసలు వీటిని తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ అనేది నియంత్రణలో ఉంటుందని నమ్ముతారు కదా? అందులో నిజమెంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం:

  • రెగ్యులర్ గా తినే వరి రకపు బియ్యం తినేవారిలో తిన్న ఆహారం త్వరగా జీర్ణమై, రక్తంలో గ్లూకోజ్ స్థాయి అనేది పెరుగుతుంది. గోధుమలను తీసుకున్నా షుగర్ లెవల్స్ అలానే స్థిరంగా ఉంటాయి. కానీ వీటికి బదులుగా జొన్నలు, రాగులు, సజ్జలు, అవిసెలు, క్వినోవా, ఓట్స్ వంటివి ఏవీ తిన్నా సరే కాస్త ఆలస్యంగా జీర్ణమవుతాయి. ఫలితంగా అంత త్వరగా రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అనేవి పెరగవు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది వీటన్నిటిలో ఒకేలా ఉంటుంది.

జిఐ అనేది మనం ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్ల వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతుంటాయి. ఇలా రక్తంలో చక్కెర స్థాయి ఎంత మేర పెరుగుతుందో తెలిపే కొలమానాన్నే గ్లైసెమిక్ ఇండెక్స్‌ అంటారు. ఇలా మనం తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయి 55కు మించకుండా ఉంటే తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ అని, 56- 69కి మధ్య ఉంటే మధ్యస్థ, 70కి మించి ఉంటే అధిక గ్లైసెమిక్‌ ఇండెక్స్‌గా చెబుతారు.

కాబట్టి మొదట్నుంచీ అలవాటు ఉంటేనో.. తీసుకోవాలే తప్ప సోషల్ మీడియాలో లేనిపోని హెల్త్ సజెషన్స్ విని ఫాలో అవ్వొద్దు. ఒక్కసారిగా అలవాటు లేని పదార్థాలను తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశముంది. దీనివల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రాక్టికల్ గా జొన్న రొట్టెలను తీసుకోవడం వల్ల తాత్కాలికంగా షుగర్​ తగ్గినా.. దీర్ఘకాలంలో తగ్గదనీ గుర్తుంచుకోవాలి.