
Neem leaves purify the blood: వేప చెట్టు ఇంటి ముందర ఉంటే.. అది అందించే నీడ.. స్వచ్ఛమైన గాలి.. మాటల్లో చెప్పలేం. అటువంటి వేపచెట్టుకు సంబంధించి వేపాకులు మంచి ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. సహజంగా మన గ్రామాల్లో వేప పుల్లలతో పళ్ళు తోమడం చూస్తుంటాం. ఆయుర్వేదంలో, ఈ చెట్టు ఆకులను అనేక వ్యాధుల చికిత్స కోసం వాడారు. వేపాకులు మాత్రమే కాదు, దాని బెరడు, పువ్వులు, నూనె కూడా మన శరీరానికి మెడిసిన్ గా పనిచేస్తాయి. అటువంటి వేపాకులను ఉదయం ఖాళీ కడుపుతో నమలడం వల్ల శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అవేమిటంటే..
- ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేపాకులు శరీరం నుంచి వేస్ట్ ను ఈజీగా బయటకు పంపడంలో హెల్ప్ చేస్తాయి. డైలీ ఖాళీ కడుపుతో వేపాకులను నమలడం వల్ల అది మీ శరీరాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తుంది. ఇది చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది.
- వేపాకులు యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల ఇవి మన శరీరంలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియా, వైరస్ లను తొలగించడంలో సాయం చేస్తాయి.
- వేపాకులు మీ కాలేయాన్ని కూడా శుభ్రపరుస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, కాంస్టిపేషన్ వంటి సమస్యల నుంచి రిలీఫ్ అందిస్తోంది. వేపాకులను క్రమం తప్పకుండా నమలడం వల్ల మీ కడుపులో వాపు, చికాకు వంటి సమస్యలు రావు.
- రక్తాన్ని శుద్ధి చేయడంలో వేపాకులు చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తాయట. రక్తంలోని మలినాలు చర్మంపై మచ్చలు, మొటిమలను కలిగిస్తాయి. అదే వేపాకులు చర్మానికి మెరుపును తెస్తాయి. కాబట్టి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ ముఖంపై ఏర్పడే మొటిమల వంటి సమస్యలు కూడా సహజంగానే తగ్గుతాయి.
- వేప నూనె కూడా చర్మానికి చాలా మంచిది.
- ఇమ్యునీటిని పెంచడంలో సహాయపడతాయి.
- డయాబెటిక్ ఉన్నవారు వేపాకులు తినడం వల్ల ఇన్సులిన్ స్థాయిని నియంత్రణలో ఉంటుంది. ఒక నెల పాటు క్రమం తప్పకుండా వేపాకులను నమలడం వల్ల, మీ రక్తంలో చక్కెర స్థాయి క్రమంగా మెరుగుపడుతుంది. వ్యాధి తగ్గుతుంది. Neem leaves purify the blood.
Also Read: https://mega9tv.com/technology/have-you-heard-of-doom-scrolling-check-how-people-are-mad-for-it/