వర్షాకాలంలో జామపండ్లు తినకూడదా?

Spread the love

Guava in Rainy Season: సీజన్ ఏదైనా ఆరోగ్యం విషయంలో, మనం తీసుకునే ఆహారం పట్ల కొంత అవేర్‌నెస్‌ కలిగి ఉండాలి. ముఖ్యంగా ఈ వర్షాకాంలో జాంపండు తినకూడదని, తింటే జలుబు చేస్తుందనే ఒక అపోహ అయితే ఉంది కదా.. కానీ ఇందులో నిజమెంత?

సీజన్ ఏదైనా, ఏజ్ గ్రూప్‌ ఏదైనా.. జామకాయను అంతా ఇష్టంగా తింటారు. స్వీట్‌ అండ్‌ జ్యూసీగా ఉండే ఈ నేచురల్‌ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఎ, లైకోపీన్, కాల్షియం,మాంగనీస్, పొటాషియం వంటి పుష్కలంగా లభిస్తాయి. పైగా ఇందులో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఎదిగే పిల్లలనుంచి, పెద్దవాళ్ల దాకా ఎవరైనా ఈ పండు ఇబ్బందిలేకుండా తినవచ్చు. అలాగే షుగర్ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉండాలని కొంతమంది అనుకుంటారు ఎందుకంటే జామపండు తినడానికి తియ్యగా ఉన్నప్పటికీ ఇది మేలే చేస్తుంది. జామలో ఉండే సహజమైన పీచు రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో సాయపడుతుంది.

జామ పండులో లభించే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు, జీర్ణశక్తిని పెంపొందించడంలో హెల్ఫ్‌ చేస్తుంది. మలబద్ధకాన్ని సైతం దూరం చేస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేసి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. ఇమ్యునిటీ తక్కువగా ఉన్నవారు వర్షాకాలంలో ప్రతిరోజూ హ్యాపీగా తినవచ్చు. జామకాయలోని పొటాషియం, సోడియంలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రెగ్యులర్‌గా తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. Guava in Rainy Season

అధిక రక్తపోటును నియంత్రించడంలోనూ సాయపడుతుంది. ఇక బరువు తగ్గడంలో కూడా జామకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువ. ఇతర పండ్లతో పోలిస్తే జామలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపునిండుగా ఉంచుతుంది అందువల్ల పెద్దగా ఆకలి అనిపించదు. జామకాయను మొదట్నుంచీ పడనివారు, అలెర్జీలున్నవారు డాక్టర్ల సలహామేరకు తీసుకోవడం మంచిది.

Also Read: https://mega9tv.com/life-style/are-you-losing-weight-you-could-get-cancer-checkout-the-cancer-symptoms-and-stay-healthy/