7-8 బ్రీతింగ్ టెక్నిక్ తో మంచి నిద్ర!

Spread the love

మనం హెల్తీగా ఉండేందుకు టైంకి తినడం, సరిపడ నీరు తాగడం ఎంత అవసరమో కంటి నిండా నిద్ర పోవడం కూడా అంతే అవసరం. సోషల్ మీడియా హవా నడుస్తున్న ఈరోజుల్లో ఫోన్ వాడకం పెరగడం వల్ల చాలామంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. మెడిసిన్ పరంగా, ఫుడ్ హ్యాబిట్స్ పరంగా, ప్రాణాయామ, వ్యాయామ పద్ధతులను ఫాలో అయి ఉంటారు. టెంపరరీగా రిజల్ట్ ఉన్నా.. లాంగ్ రన్ లో ఎఫెక్ట్ పెద్దగా ఉండదు. కాబట్టి ఈ 4-7-8 శ్వాస పద్ధతిని అలవాటు చేసుకుంటే.. మంచి నిద్ర ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదేంటో చూద్దామా..

4-7-8 శ్వాస ప్రక్రియ అంటే.. ధ్యానం, ప్రాణాయామం, విజువలైజేషన్‌ను కలిపి చేసే బ్రీతింగ్ మెథడ్స్ అనేవి మీరు వేగంగా నిద్ర పోవడానికి హెల్ప్ చేస్తాయి. అలానే 4-7-8 శ్వాస టెక్నిక్ ముందుగా మెదడు, మనసును రిలాక్స్ చేస్తాయి. ఆందోళనను తగ్గించి త్వరగా నిద్రలోకి జారుకునేలా చేస్తుంది. ఈ పద్ధతిలో ముక్కు ద్వారా ముందుగా 4 సెకన్లపాటు గాలి పీల్చి, 7 సెకన్ల పాటు శ్వాసను బిగపట్టి ఉంచాలి. చివరగా 8 సెకన్ల పాటు నోటి ద్వారా గాలిని వదలాల్సి ఉంటుంది.

  • ఇందుకోసం కంఫర్ట్ బుల్ గా కూర్చోవడం లేదా పడుకోవడం చేయాలి.
  • మీ ముక్కు ద్వారా నాలుగు అంకెలు లెక్కించేవరకూ నిశ్శబ్దంగా గాలిని పీల్చుకోండి.
  • ఏడు లెక్క పెట్టేంతవరకూ శ్వాసను బిగపట్టుకుని ఉంచండి.
  • ఎనిమిది అంకెలు మనసులో లెక్కించుకుంటూ నోటి ద్వారా గాలిని పూర్తిగా వదలండి.
  • ఇలా ఈ సైకిల్ ను కనీసం నాలుగుసార్లు రిపీట్ మోడ్ లో చేయాలి.

ఈ టెక్నిక్ వల్ల నాడీ వ్యవస్థ ఆక్టివ్ అండ్ కూల్ అవుతుంది. మనసులో ఆందోళన భావాలను తగ్గిస్తుంది. దీనివల్ల నిద్రలేమి సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. ఈ టెక్నిక్‌ని పాటించడం వల్ల త్వరగా నిద్ర పడుతుంది.