దశాబ్దాల డీఎంకే-కాంగ్రెస్  రాజకీయ బంధానికి తెర..!

Spread the love

రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని చెబుతుంటారు. తాజాగా అలాంటి కీలక పరిణామమే తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో డీఎంకే ఓటమి కొత్తగా వచ్చిన సినీ నటుడు విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో కాంగ్రెస్ తన దశాబ్దాలుగా అక్కడ డీఎంకేతో దూరం జరిగి విజయ్ పార్టీకి మద్దతివ్వడంతో అన్నేళ్ల రాజకీయ మిత్రుత్వానికి దూరమైనట్లే కనిపిస్తున్నాయి.  ఇప్పుడు జాతీయ స్థాయిలో డీఎంకే – కాంగ్రెస్ మధ్య పొత్తుపై కూడా ప్రభావం చూపినట్లు కనిపిస్తున్నాయి. టీవీకే అధినేత విజయ్‌ కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై డీఎంకేలో చర్చ మొదలైంది.  చివరకు కాంగ్రెస్‌తో బంధాన్ని అధికారికంగా తెంచుకున్నట్లే కనిపిస్తోంది. తమిళనాట మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడం సరికొత్త చర్చకు దారితీసింది. కాంగ్రెస్‌ తో పొత్తు ముగిసిపోయిన క్రమంలో ఇకపై వారితో కలిసి కూర్చోవడం సముచితం కాదని ఆమె స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నిర్ణయం ‘ఇండియా’ కూటమికి జాతీయ స్థాయిలో గట్టి దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూడా డీఎంకే, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణకు సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిన్నటి వరకు మిత్రపక్షాలుగా ఉన్న రెండు  పార్టీల శ్రేణులు ఇలా ఘర్షణ పాడడం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. డీఎంకే ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నుండి  ఆ పార్టీ తప్పుకోవడంపై . కూటమికి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచి ద్రోహం చేసిందని తన పాత రాజకీయ స్వభావాన్ని ఆ పార్టీ మార్చుకోలేదని విమర్శించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *