
ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భ్రదతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 30 మంది మావోలు చనిపోయారు. మాధ్ ఏరియాలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందుకున్న బలగాలు, భారీగా కూంబింగ్ చేశారు. బీజాపూర్, నారాయణ్ పూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు మూకుమ్మడిగా మావోలపై దాడి చేశాయి. చనిపోయిన వారిలో కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఈ దాడిలో చనిపోయాడు. అతనిపై కోటిన్నర రివార్డ్ ఉందని పోలీసులు చెబుతున్నారు. అలిపిరి దాడిలో కీలక సూత్రధారి అయిన కేశవరావు, 2010లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి ఘటనలో కూడా కీలక నిందితుడని పోలీసులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా జయ్యన్నపేటకు చెందిన కేశవరావు, తూర్పు గోదావరి జిల్లాలో పీపుల్స్ వార్ పార్టీలో పనిచేశాడు. తర్వాత వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చదివాడు. 1970 నుంచి మావోయిస్ట్ కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న కేశవరావు, గెరిల్లా పోరాటాల్లో దిట్ట.