ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తమిళనాడులో కొత్తగా ఏర్పడిన విజయ్ పార్టీ టీవీకే ఎక్కువస్థానాలతో దూసుకెళ్తోంది. ఆశ్చర్యకరంగా అక్కడ అధికార డీఎంకే మూడో స్థానంలో కొనసాగుతోంది. అక్కడ 234 విజయ్ పార్టీ 100+ సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా..అన్నాడీఎంకే 70 స్థానాల్లో, డీఎంకే 60కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మరోవైపు బీజేపీ బెంగాల్ లో భారీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 297 స్థానాలున్న బెంగాల్ లో 148 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ 130 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. కాంగ్రెస్ నామమాత్రంగానే సీట్లకే పరిమితమైంది. ఇక అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తోంది. అక్కడ 126 స్థానాలుండగా..బీజేపీ ఇప్పటికే 97 స్థానాలకు పైగా ఆధిక్యంలో కనిపిస్తోంది. కేరళలో యూడీఎఫ్ 96 స్థానాల్లో, ఎల్డీఫ్ 42 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. పుదుచ్చేరిలో ఏఎన్నార్ కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.