ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కలవరం: 1700+ కేసులు, ఆరోగ్య శాఖ అప్రమత్తం

Spread the love

దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసులు కలవరపెడుతున్నాయి. ఏకంగా 1700 దాటడం పరిస్థితి ఏవిధంగా అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య  శాఖ అప్రమత్తమైంది. అయితే పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చికిత్సకు అవసరమైన అన్ని  ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇక దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి అధికారులు చర్చించారు. ఇన్ఫెక్షన్ తీవ్రత, హాట్ స్పాట్ లపై ఎల్లప్పుడూ నిఘా కొనసాగుతోంది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచే ఢిల్లీలో H1N1 ఇన్‌ఫ్లుఎంజా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అధిక తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు, మారుతున్న వాతావరణం వైరల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి దోహదపడుతున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.  H1N1 వైరస్ వల్ల వచ్చే స్వైన్ ఫ్లూ, ఇది ఒక అంటువ్యాధి శ్వాసకోశ సంక్రమణం. 2009లో ఇది ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా మారి, మానవులలో వేగంగా వ్యాపించింది. అప్పట్లో చాలామందికి ఈ వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి లేకపోవడంతో, అది త్వరగా విస్తరించింది. స్వైన్ ఫ్లూ లక్షణాలు సాధారణ ఫ్లూ లక్షణాల మాదిరిగానే ఉంటాయి, వైరస్ సోకిన ఒకటి నుండి నాలుగు రోజుల తర్వాత బయటపడతాయి. శ్వాసనాళాల ద్వారా, తుమ్ముల ద్వారా, దగ్గుల ద్వారా, కలుషితమైన ఉపరితలాలను తాకడం ద్వారా ఇది వ్యాపిస్తుంది.ప్రస్తుతం ఢిల్లీలో స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు అనూహ్యంగా పెరిగాయి. ఆగస్టు 20, 2026 నాటికి 1,777 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది ఎక్కువ.బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ప్రజలకు సూచిస్తోంది. ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స అందించడం, ప్రజల్లో పరిశుభ్రత, అవగాహన పెంచడం అత్యంత కీలకం. ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అయితే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో తక్కువ, మధ్యస్థ తీవ్రత ఉన్నట్లుగానే తెలుస్తోంది. అయితే చిన్న పిల్లలు, వృద్దులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. స్వైన్ ఫ్లూ (H1N1) వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి సమతుల్య పోషకాహారం తీసుకోవడం కూడా  చాలా అవసరమని విటమిన్-C సమృద్ధిగా ఉండే ఉసిరి, నిమ్మ, నారింజ, జామ వంటి పండ్లు తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి శారీరక రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. మన నిత్య వంటకాల్లో వాడే పసుపు, అల్లం, వెల్లుల్లిలలో ఉండే యాంటీవైరల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు గొంతు సమస్యలను నివారించి శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటికి తోడు బాదం, జీడిపప్పు, నువ్వుల వంటి గింజల ద్వారా లభించే జింక్, అలాగే గుడ్లు, పప్పు ధాన్యాలు మరియు పెరుగు ద్వారా అందే ప్రొటీన్లు శరీర కణాల పునర్నిర్మాణానికి ఎంతగానో తోడ్పడతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *