ఈ సందర్శన నిజమైన నూతన భాగస్వామ్యానికి బలమైన పునాది వేసింది

Spread the love

భారత్ లో పర్యటించిన కెనడా ప్రధాని మార్క్ కార్నే ఇది కేవలం కెనడా-భారత్ భాగస్వామ్యానికి పునరుద్ధరణ మాత్రమే కాదని భవిష్యత్తు కోసం తమదైన సొంత మార్గాన్ని ఏర్పరచుకుంటున్న రెండు ఆత్మవిశ్వాసం గల దేశాల మధ్య, కొత్త ఆశయాలు మరియు లక్ష్యాలతో కూడిన విస్తరణ అని పేర్కొన్నారు. దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ లో కెనడా ప్రధాని పోస్ట్ కు బదులిస్తూ ఖచ్చితంగా, ప్రధాని కార్నీ మీరు చెప్పింది నిజం. మీ సందర్శన నిజమైన నూతన భాగస్వామ్యానికి బలమైన పునాది వేసింది. మన దేశాల ప్రజల కోసం నమ్మకం, వృద్ధి, ఆవిష్కరణ మరియు ఉమ్మడి శ్రేయస్సుతో కూడిన భవిష్యత్తును నిర్మించడానికి మీతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. 

కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ భారత పర్యటన ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన మరియు ఆర్థిక సంబంధాలలో ఒక కొత్త అధ్యాయానికి కీలక ముందడుగు పడింది. ఈ పర్యటనలో ముఖ్యంగా వాణిజ్యం, సాంకేతికత మరియు పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ఇరు దేశాలు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నాయి. “నమ్మకం, వృద్ధి మరియు ఆవిష్కరణ” ప్రాతిపదికన భవిష్యత్తును నిర్మించుకోవాలని, ఇరు దేశాల ప్రజల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయాలని ప్రధాని కార్నీ అన్నారు.  ఈ పర్యటన కేవలం పాత సంబంధాలను పునరుద్ధరించడమే కాకుండా, మారుతున్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు తగినట్లుగా  సరికొత్త లక్ష్యాలతో భాగస్వామ్యాన్ని విస్తరించడానికి ఒక బలమైన పునాది వేసిందన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *