తమిళనాట మరొక కొత్త పార్టీ తెరపైకి వచ్చింది. త్వరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకేలో ఒకప్పుడు కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ కొత్త పార్టీని ప్రకటించారు. ‘ఆల్ ఇండియా పురుచ్చితలైవర్ మక్కళ్ మున్నేట్ర కజగం’ పేరుతో ఆ పార్టీని ప్రకటించారు. కొబ్బరిచెట్ల తోటను పార్టీ సింబల్ గా తెలిపారు. తమ పార్టీ ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా పనిచేస్తుందని ఈ గుర్తు యూనిటీకి సింబల్ అని తెలిపారు. తన అనుచరులతో కలిసి మీడియాకు వివరాలు తెలిపారు. ఈ సారి ప్రముఖ సినీ నటుడు విజయ్ కూడా తన సొంత పార్టీతో ప్రజల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ప్రజల మధ్య ఆయన తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పుడు మరో కొత్త పార్టీ బరిలోకి వచ్చింది. తమిళనాట ప్రస్తుతం డీఎంకే, అన్నా డీఎంకే లతో పాటు అటు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఇక ఇప్పుడు కొత్త పార్టీలను ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారనేది చూడాల్సిఉంది.