నో డౌట్స్..నో డిలేస్…సంక్రాంతికే మెగాస్టార్ ‘కాకా’ రిలీజ్ 

Spread the love

మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్ లో వస్తున్న ‘కాకా’ సినిమా ఇప్పటికే రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 13న ఈ సినిమా విడుదలను ప్రకటించారు. అయితే ఇటీవల వచ్చిన కొన్ని వార్తల నేపథ్యంలో మూవీ టీమ్ మరోసారి స్పష్టతనిచ్చింది. దర్శకుడు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఆలస్యం లేదు అనుమానాలు అవసరం లేదు. అనుకున్న సమయానికే సినిమా వస్తుందని స్పష్టం చేశారు. దీంతో మెగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. 

గతంలో బాబీ-మెగాస్టార్ ల కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ భారీ హిట్ ను అందుకున్న నేపథ్యంలో భారీ అంచనాలున్నాయి.  కెవిఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళ నటి అనశ్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమె పాత్రకు ‘అమ్ములు పాప’ అనే పేరును పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. అలాగే నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను తదితరులు సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.థమన్ ఎస్. సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంటోనీ ఎల్. రూబెన్ ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.  ఇక మరో సినిమా ‘విశ్వంభర’ కూడా త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి లాంటి సూపర్ సోసియో ఫాంటసీ సినిమాల  తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తిస్థాయి సోషియో-ఫాంటసీ విజువల్ వండర్ విశ్వంభర కోసం మెగా అభిమానులే కాదు, యావత్ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుండి  ఒక అదిరిపోయే అప్‌డేట్ ఫిలింనగర్ సర్కిల్స్ నుంచి బయటకు వచ్చింది. చాలా కాలంగా విశ్వంభర సినిమా విడుదలకు ప్రధాన అడ్డంకిగా మారిన ఓటీటీ హక్కుల అంశం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.  ప్రముఖ ఓటీటీ సంస్థ అత్యంత భారీ ధరకు ఈ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు టాక్. ఓటీటీ డీల్ క్లియర్ అవ్వడంతో ఇక థియేట్రికల్ రిలీజ్ డేట్‌పై మేకర్స్ దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. బింబిసార లాంటి బ్లాక్‌బస్టర్ సోషియో-ఫాంటసీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ వశిష్ఠ, తన రెండో సినిమానే మెగాస్టార్‌తో చేస్తుండటంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. యూవీ క్రియేషన్స్ ఈ సినిమా కోసం ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌ను క్రియేట్ చేయిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ సరసన ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష కథానాయికగా నటిస్తుండగా.. ఆషికా రంగనాథ్, ఈషా చావ్లా, సురభి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *