కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 15, 2026 అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈమేరకు మొత్తం 824 అసెంబ్లీ స్థానాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు అన్ని రాష్ట్రాలకు కలిపి మే 4, 2026న జరగనుంది. రాష్ట్రాల వారీగా చూస్తే అస్సాంలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. కేరళలో కూడా 9న జరగనుంది. పుదుచ్చేరిలో కూడా ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. ఇక పశ్చిమ బెంగాల్ లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది ఏప్రిల్ 23న మొదటి విడతలో 29న రెండో విడత పోలింగ్ జరగనుంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మే 4న ప్రకటించనున్నారు. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి సుమారు 17.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.