కూటమి ప్రభుత్వం యువత ఆకాంక్షలను మనసుతో అర్థం చేసుకుంటోంది:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

Spread the love

ఉగాది పర్వదినాన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర యువతకు కూటమి ప్రభుత్వం తీయటి కబురు చెప్పిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు. 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని నిర్దేశిత సమయంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువత ఆకాంక్షలను మనసుతో అర్థం చేసుకుంటోందని ఈ 20 నెలల కాలంలో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు.  ఉపాధ్యాయ, కానిస్టేబుల్ పోస్టులకి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించినప్పుడు యువత కళ్లలో ఆనందం చూసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఇచ్చే నోటిఫికేషన్ల ద్వారా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.  గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంజనీరింగ్, టీచింగ్, యూనిఫాం సర్వీసెస్ పోస్టులను భర్తీ చేయనున్నాము. ఇక ఉద్యోగార్థులు ప్రిపరేషన్ లో నిమగ్నం కావాలని సూచించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *