ప్రపంచ క్రికెట్ లో నిలకడ లేని ఆటతీరుతో తడబడే పాకిస్తాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ లో మొదటి టెస్టులో పరాజయం చెందడమే కాకుండా మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. లీడ్స్ లో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో 103 పరుగులు తేడాతో పరాజయం చెందింది. రెండు ఇన్నింగ్స్ లలో పాకిస్తాన్ 0 పరుగుల దగ్గర మొదటి వికెట్ ను కోల్పోయింది. అయితే ఇదేమి మొదటిసారి కాదు. ఆ జట్టు ఇప్పటికి ఏడుసార్లు ఇలా సున్నాకే రెండు ఇన్నింగ్స్ ల్లోనూ ఓపెనర్ వికెట్నుకోల్పోయింది. ఇలా ప్రపంచంలో మరే జట్టు కూడా అత్యధికసార్లు ఇటువంటి రికార్డును నమోదు చేయలేదు. పాక్ ఇప్పటి వరకు 472 టెస్టులు ఆడింది.. ప్రతి 68 మ్యాచులకు ఒకసారి రెండు ఇన్నింగ్స్ ల్లోనూ సున్నాకే తమ ఓపెనర్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ లిస్టులో 1098 టెస్టుల్లో 5సార్లతో నిలిచింది. భారత్ కూడా కేవలం 2 టెస్టుల్లోనే ఇలాంటి రికార్డును నమోదు చేసింది. ఇక ఇంగ్లాండ్ తో టెస్టులో పాక్ ఘోర పరాజయం చవిచూసింది. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 409 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్ 171 పరుగులకు మొదటి ఇన్నింగ్స్ లో రెండో ఇన్నింగ్స్ లో 135 పరుగులకే కుప్పకూలి ఇన్నింగ్స్ 103 రన్స్ తేడాతో ఓడింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ స్థాయిలో ఒకప్పుడు బలమైన శక్తిగా గుర్తింపు పొందింది. 1992లో వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. అలాగే, 2009లో టీ20 ప్రపంచ కప్‌ను కూడా కైవసం చేసుకుంది. కానీ, గత రెండు దశాబ్దాలుగా జట్టు ఆటతీరులో తీవ్రమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక మ్యాచ్‌లో అద్భుతంగా ఆడితే, మరొక మ్యాచ్‌లో పేలవంగా ఓడిపోవడం సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో వారి నిలకడ లేమి స్పష్టంగా కనిపిస్తుంది.ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ స్పిన్నర్ అలీ ఉస్మాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన కెరీర్లో తొలిసారి ఐదు వికెట్లు పడగొట్టడం ఒక్కటే పాకిస్తాన్ అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. రాబోయే ఆగస్టు 27న లార్డ్స్‌లో జరగనున్న రెండో టెస్టులో పాకిస్తాన్ ఎలా పుంజుకుంటుందో చూడాలి.