మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరతను అరికట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇరాన్ దగ్గరలోని హార్మోజ్ జల సంధిని భారత్ కు చెందిన రెండు భారీ షిప్ లు ఆ జలసంధిని దాటి ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి ప్రవేశించి భారత్ వైపు వస్తుండడం ఉపశమనం కలిగించే అంశమే. ఇరాన్ లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనుమతితో జగ్ వసంత్, పైన్ గ్యాస్ అనే రెండు ఎల్.పీ.జీ భారీ షిప్ లు నేడు హార్మోజ్ ను దాటాయి. త్వరలోనే ఈ షిప్ లు మన పోర్టులకు చేరుకోనున్నాయి. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో కొన్ని రోజులుగా పలు షిప్ లు నిలిచిపోయిన విషయం విదితమే. అయితే మన షిప్ లు హార్మోజ్ ను దాటేవిధంగా భారత ప్రభుత్వం ఇరాన్ తో నిరంతరం చర్చలు జరిపింది. దీంతో కొద్ది రోజులుగా ఒక్కో షిప్ భారత్ చేరుకుంటున్నాయి. ఇరాన్ సీనియర్ లీడర్ అలీ లారి జానీ మరణం, ఆ దేశ ఆయిల్ ఫీల్డ్స్ పై అమెరికా దాడులతో షిప్ ల ప్రయాణానికి అనుమతులు ఆలశ్యమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.