పాకిస్థాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్ ను సన్ రైజర్స్ లీడ్స్ టీమ్ రూ.2.34 కోట్లు ఖర్చు చేసి కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ ఫ్రాంచైజీపై భారత క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆక్షన్ లో సన్ రైజర్స్ సీఈవో కావ్యా మారన్, ప్రధాన కోచ్ డానియల్ వెట్టోరి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ లీడ్స్ అకౌంట్ సస్పెన్షన్ కు గురి కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి గల కారణాల గురించి ‘ఎక్స్’ ఎటువంటి ప్రకటన చేయలేదు. యూజర్లు ఆ అకౌంట్ చూసేందుకు ట్రై చేస్తుంటే ‘అకౌంట్ సస్పెండెడ్. ఎక్స్ సస్పెండ్స్ అకౌంట్స్ దట్ వయోలేట్ ది ఎక్స్ రూల్స్’ అని పాప్ అప్ మెసేజ్ కనిపిస్తోంది.గతేడాది నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ ‘హండ్రెడ్’ బరిలో దిగిన లీడ్స్ జట్టును సన్ టీవీ నెట్వర్క్ పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు నుండి 49% వాటా, మిగిలిన 51% వాటాను యార్క్ షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ నుండి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.