అక్కడికి వద్దు..ఆస్ట్రేలియా క్రికెటర్లకు జాగ్రత్తలు  

Spread the love

ఈ నెల 26 నుండి పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభమవనుంది.ఇందులో  స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, లబుషేన్, మాక్స్వెల్ వంటి ఆస్ట్రేలియన్ క్రికెటర్లు ఆడనున్నారు.  అలాగే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు టిమ్ పైన్, గిలెస్పీ ఈ లీగ్ కోచ్ లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ లీగ్ నిర్వహణ పాక్ ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ పై చేసిన చర్యతో ప్రమాదంలో పడింది. పాకిస్థాన్ ఆర్మీ ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కేబుల్ లోని ఓ హాస్పిటల్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 400 మంది అమాయక ప్రజలు మరణించారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ క్రికెటర్లు పాక్ కు వెళ్లొచ్చని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పెషావర్ కు  మాత్రం అడుగుపెట్టొద్దంటూ హెచ్చరిస్తోంది. షెపావర్ ను  ఆస్ట్రేలియా ప్రభుత్వం నో ట్రావెల్ జోన్లోకి చేర్చింది. అయితే ఈ నగరంలోని ఇమ్రాన్ ఖాన్ స్టేడియంలో మార్చి 28న పెషావర్ జల్మీ, రావల్పిండి జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *