జావెలిన్ సూపర్ స్టార్ నీరజ్ చోప్రా ఆసియా క్రీడలకు దూరమవడం అభిమానులకు నిరాశ కలిగించే అంశం. ట్రైనింగ్ లో అతడి చీలమండ లిగ్మెంట్ కు గాయం కావడంతో అతను ఈ కీలక క్రీడలలో పాల్గొనడం లేదు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. కొంతకాలం కఠినమైన శిక్షణ తర్వాత, లోసాన్ లీగ్లో ఈ సీజన్లోనే నా అత్యుత్తమ త్రో సాధించడంతో చివరకు నేను అనుకున్న వేగం అందుకోగలుగుతున్నానని అనిపించింది. దురదృష్టవశాత్తు, ఆ తర్వాత కొద్దిరోజులకే శిక్షణలో నా యాంకిల్ లిగమెంట్ దెబ్బతింది. డాక్టర్ మరియు నా టీమ్ తో చర్చించిన తర్వాత, ఈ సీజన్ లోని మిగిలిన పోటీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాము. ముఖ్యంగా మళ్ళీ ఫామ్లోకి వస్తున్న సమయంలో ఇలా జరగడం ఎంతో నిరాశ కలిగించింది. కానీ అంటారు కదా, అడ్డంకులు కూడా పయనంలో ఒక భాగమే అని.ఇప్పుడు నా దృష్టి అంతా త్వరగా కోలుకోవడం మరియు అంతకంటే బలంగా తిరిగి రావడంపైనే ఉంది. మీరు చూపిస్తున్న ప్రేమకు, అందిస్తున్న మద్దతుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అని తన ప్రకటనలో తెలిపాడు.
భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా అభిమానులకు ఇది నిజంగా ఒక షాకింగ్ న్యూస్. ప్రపంచ స్థాయి అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా 2026 అథ్లెటిక్స్ సీజన్లోని మిగిలిన అన్ని పోటీలకు, ముఖ్యంగా రాబోయే ఆసియా క్రీడలకు దూరం కావడం తీవ్ర నిరాశ కలిగించే అంశం. శిక్షణ సమయంలో చీలమండ లిగ్మెంట్ గాయం కావడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మరి ఈ పరిణామం భారత క్రీడలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. నీరజ్ చోప్రా ఆసియా క్రీడలకు దూరం కావడంతో భారత జావెలిన్ జట్టుకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. గత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకంతో సత్తా చాటిన నీరజ్, ఈసారి తన టైటిల్ ను కాపాడుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. భారతదేశానికి స్వర్ణ పతకం తేవాలనే ఆశలు పెట్టుకున్న అభిమానులకు ఇది నిజంగా నిరాశ కలిగించే వార్త. సోషల్ మీడియాలో అభిమానులు “గెట్ వెల్ సూన్ నీరజ్” అంటూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అతనికి తమ మద్దతును తెలుపుతున్నారు. గతంలో అతను చూపిన ప్రదర్శనలు, ముఖ్యంగా ఒలింపిక్స్ స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్షిప్ పతకాలు అతన్ని భారత క్రీడా చరిత్రలో ఒక గొప్ప ఆటగాడిగా నిలబెట్టాయి. ఇప్పుడు ఈ కీలక టోర్నమెంట్లలో అతను లేకపోవడం భారత పతకాల సంఖ్యపై ప్రభావం చూపవచ్చు. అయితే ఇతర భారత అథ్లెట్లు ఈ లోటును తీరుస్తారా అనేది చూడాలి.