మూడు టీమ్ లతో పైబాల్…సరికొత్త క్రీడను పరిచయం చేసిన ఐఐటీ మద్రాస్

Spread the love

క్రీడా ప్రపంచంలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  (ఐఐటీ) మద్రాస్ సరికొత్త క్రీడను పరిచయం చేసింది. అదే ‘ఫైబాల్’. బాస్కెట్‌బాల్ తరహాలో ఉండే ఈ క్రీడ, మూడు జట్లతో, మూడు బాస్కెట్‌లతో ఆడబడుతుంది. భారతదేశంలో క్రీడలను ప్రోత్సహించడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. మేజర్ ధ్యాన్ చంద్ పుట్టిన రోజును పురస్కరించుకుని జరుపుకునే జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా దీనిని పరిచయం చేశారు. ఈ కొత్త క్రీడ బాస్కెట్‌ బాల్‌తో పాటు, ఐఐటీ మద్రాస్ గతంలో ప్రవేశపెట్టిన ఒమెగాబాల్ నుండి ప్రేరణ పొందింది, అది కూడా మూడు వైపుల క్రీడే. ఈ తరహా క్రీడలు భారతదేశంలో విస్తృతంగా ఆదరణ పొందగలవని నిపుణులు భావిస్తున్నారు. ఫైబాల్ 26 మీటర్ల వ్యాసార్థం కలిగిన సర్కిల్ షేప్ లో ఉన్న  కోర్టులో ఆడతారు. ఈ కోర్టును మూడు సమానమైన 120-డిగ్రీల సెక్టార్‌లుగా విభజించారు, ఆట స్థలం చుట్టూ మూడు బాస్కెట్‌లు ఉంటాయి. ప్రతి జట్టు రెండు ప్రత్యర్థి బాస్కెట్‌లను అటాక్ చేస్తుంది, అదే సమయంలో ఒక బాస్కెట్‌ ను డిఫెండ్ చేస్తుంది. ఈ క్రీడ వ్యూహాత్మక ఆలోచనను, వేగాన్ని ప్రోత్సహించడానికి రూపొందించబడింది. ఇందులో ‘నో-ఆఫెన్స్ జోన్’ వంటి ప్రత్యేక నియమాలు, అలాగే మూడు డ్రిబుల్స్‌కు మాత్రమే అనుమతి ఉండటం ఆటగాళ్లకు కొత్త సవాళ్లను విసురుతుంది. ఇది వ్యక్తిగత నైపుణ్యాల కంటే పాసింగ్ మరియు టీమ్‌వర్క్‌పై ఎక్కువ దృష్టి పెట్టే విధంగా  ప్రోత్సహిస్తుంది. ఇది సంప్రదాయ బాస్కెట్‌బాల్‌తో పోలిస్తే పాఠశాలలు, ముఖ్యంగా గ్రామీణ మరియు ప్రభుత్వ పాఠశాలలు సులభంగా ఉపయోగించుకునేలా ఉంటుంది. ఇది తక్కువ సెటప్ ఖర్చుతో కూడుకున్నది. ఇది క్రీడల పట్ల ఆసక్తిని పెంచడమే కాకుండా, యువతలో శారీరక శ్రమను ప్రోత్సహిస్తుంది. ఈ కొత్త క్రీడ గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు మంచి అవకాశాలను అందిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ గేమ్  ను టీమ్‌వర్క్, వేగం, కమ్యూనికేషన్, వ్యూహాత్మక నిర్ణయాలు, నిష్పక్షపాతంగా ఉండటం, భద్రత అనే విలువల ఆధారంగా అభివృద్ధి చేశారు. గ్రామీణ ప్రాంతాలు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో ఖరీదైన సింథటిక్ లేదా కాంక్రీట్ కోర్టులు అవసరం లేకుండా, తక్కువ ఖర్చుతోనే  మట్టి లేదా గడ్డి మైదానంలో కూడా ఈ ఆటను ఆదుకునే విధంగా రూపొందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *