ప్రస్తుతం క్రికెట్ లో మారుమోగుతున్న పేరు వైభవ్ సూర్యవంశీ. సుదీర్ఘ అనుభవమున్న ప్రపంచస్థాయి క్రికెటర్లు సైతం ఈ పిల్లాడి ఆటను చూసి ఆశ్చర్యపోతున్నారు. పదిహేనేళ్ల ఓ కుర్రాడు తన అసాధారణ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంటి వేదికలపై అదరగొడుతూ క్రికెట్ పరిచయమున్న దేశాలలో సోషల్ మీడియాలలో పతాక శీర్షికలుగా నిలుస్తున్నాడు. వయసుకు మించిన ఆటతీరు, ప్రతిభ ఆ బాలుడిని అనతి కాలంలోనే గుర్తింపు పొందేలా చేశాయి. అతను ఎంచుకున్న రంగంలో అందులో అతను ప్రదర్శించిన నైపుణ్యం చూసి దశాబ్దాలుగా సూపర్ స్టార్ లు గా వెలుగొందుతున్న వారు కూడా అతడిని తమ అభిమాన క్రికెటర్ గా చూస్తున్నారంటే ఆ టాలెంట్ ను అర్ధం చేసుకోవచ్చు. ఈ చిన్న వయసులోనే ఇంతటి ప్రతిభను కనబరచడం వెనుక అతని నిరంతర కృషి, పట్టుదల స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇటీవల కీలక మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ సన్ రైజర్స్ హైదరాబాద్ పై చేసిన 97 పరుగులు ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. అతను పవర్ ప్లే లో స్కోరు బోర్డును పరుగులు పెట్టించి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లిన తీరు అద్భుతమని చెప్పక తప్పదు. కేవలం 29 బంతుల్లోనే 300కు పైగా స్ట్రైక్ రేట్ తో చెలరేగాడు. 12 సిక్సర్లతో దుమ్ముదులిపాడు. ఇంకొంచెం ఉంటే క్రిస్ గేల్ ఫాస్టెస్ట్ సెంచరీని సమం చేసే వాడు. ఇక ఈరోజు మరొక కీలక మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడనున్న నేపథ్యంలో అందరి చూపు ఈ చిన్న క్రికెటర్ పైనే ఉందంటే అతని ప్రభావం అర్ధం చేసుకోవచ్చు. వయసులోనే చిన్న కానీ బ్యాట్ పట్టి క్రీజులో నిలబడితే అతి పెద్ద క్రికెటర్లు కూడా అతని ముందు చిన్నబోతున్నారు. ఆ రేంజ్ లో వైభవ్ ఒక స్టాండర్డ్ సెట్ చేశాడు.
ఈ కుర్రాడి అద్భుతమైన ప్రదర్శనలపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రముఖులు, నెటిజన్లు మరియు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఆ బాలుడి టాలెంట్‌ను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. “భవిష్యత్తు ఈ క్రికెటర్ దే అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ విజయం పట్ల ఎంతో గర్వపడుతున్నారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొని అనుకున్నది సాధించవచ్చని ఈ కుర్రాడు నిరూపించాడని పలువురు ప్రశంసిస్తున్నారు.
చిన్న వయసులోనే ఇంతటి ఘనత సాధించిన ఈ బాలుడు నేటి యువతరానికి ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. సరైన టార్గెట్ దానికి చేరుకునేందుకు వయసుతో సంబంధం లేకుండా అనుకున్న శిఖరాలను అధిరోహించవచ్చని అతని ఆటతీరు స్పష్టం చేస్తోంది. రాబోయే రోజుల్లో అతను మరింతగా రాణించి, దేశానికి కూడా ప్రాతినిధ్యం వహించి మంచి పేరు తీసుకురావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఈ అద్భుత ఆటగాడు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు.