భారత్ మరిన్ని ట్రోఫీలు గెలుస్తుంది:సంజూ శాంసన్

Spread the love

ప్రపంచ టీ 20 క్రికెట్ లో తన ఆధిపత్యాన్ని కనబరుస్తూ వరుసగా రెండో సారి మొత్తంగా మూడోసారి టీ20 విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఫార్మాట్ లోనే కాకుండా భారత్ తనదైన శైలిలో అన్ని ఫార్మాట్లలో గణనీయంగా తన డామినేషన్ చూపిస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని ట్రోఫీలను భారత్ గెలుచుకుంటుందని ఈ వరల్డ్ కప్ లో భారత్ విజయాల్లో కీలకంగా నిలిచిన విధ్వంసక ఓపెనర్ సంజు శాంసన్ ధీమా వ్యక్తం చేశాడు. తాజాగా బీసీసీఐ నమన్ పురస్కారాల కార్యక్రమంలో శాంసన్  మాట్లాడాడు. టీ 20 వరల్డ్ కప్ గురించి స్పందిస్తూ ఇది నిజంగా జరిగిందా అనిపిస్తోంది. భారత్  ఇలాంటి వరల్డ్ కప్ లు  భవిష్యత్తులో తరచూ సాధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. టీమ్ ఇండియాలో అంత క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారని అన్నాడు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ ఈ గెలుపు నాకు అద్భుతంగా అనిపిస్తోంది. మొదట నేను టీమ్ లోనే లేను. అదృష్టవశాత్తు అవకాశం రావడం, వరల్డ్ కప్  గెలిచిన జట్టులో భాగం కావడం గొప్పగా ఉందన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *