పొదుపులోనూ మాస్టరే..!!

Spread the love

Sachin Tendulkar: ప్రతీ ఒక్కరూ తమ సంపాదనలో పన్నులు తగ్గించుకునేందుకు ఎన్నో మార్గాలు వెతుకుతారు. కానీ కొన్నిసార్లు ఈ మార్గాలు చాలా తెలివిగా ఉంటాయి. ప్రపంచ క్రికెట్‌లో లెజెండ్ అయిన సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌లోనే కాదు పొదుపులోనూ మాస్టరే ఒక్క చిన్న ట్రిక్ తో రూ. 58 లక్షల ట్యాక్స్ ఆదా చేశారు. సచిన్ తెలివి మామూలుగా లేదుగా. ఒక్క ప్లాన్ తో లక్షల రూపాయలు ఆదా చేశాడు. ఆ డిటైల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సుమారు పదేళ్ల క్రితం, సచిన్ టెండూల్కర్ తన ప్రకటనల ఆదాయంలో నుంచి పన్ను ఆదా చేసేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 80ఆర్‌ఆర్ వాడుకున్నాడు. ట్యాక్స్‌బడ్డీ వ్యవస్థాపకుడు సుజీత్ బంగర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఈ కథను వివరించారు. బంగర్ చెప్పిన ప్రకారం, సచిన్ తన ఆదాయాన్ని రెండు వేర్వేరు వృత్తులుగా చూపాడు. ఒకటి క్రికెటర్‌గా సంపాదించినది, ఇంకొటి విదేశాల్లో షూట్ చేసిన ప్రకటనల ద్వారా వచ్చినది.

వివిధ కథనాల ప్రకారం, 2001–02, 2004–05 ఆర్థిక సంవత్సరాల ట్యాక్స్ ఫైలింగ్‌లో సచిన్ టెండూల్కర్ 5.92 కోట్ల రూపాయల విదేశీ ఆదాయంపై 30% డిడక్షన్ సెక్షన్ 80ఆర్‌ఆర్ కింద క్లెయిమ్ చేశాడు. ఇది సుమారు 1.77 కోట్లు అవుతుంది. ఈ ఆదాయం ఈఎస్పీఎన్-స్టార్ స్పోర్ట్స్, పెప్సీ, వీసా వంటి బ్రాండ్ల కోసం తీసిన ప్రకటనల ద్వారా వచ్చింది.

బంగర్ వివరించిన ప్రకారం, సచిన్ తన ట్యాక్స్ ఫైలింగ్‌లో “నేను క్రికెటర్ కాదు, నటుడు” అని తెలిపారు. దీని వల్ల సుమారు 58 లక్షల రూపాయల పన్ను ఆదా అయ్యింది. అయితే, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల నుంచి ఆయనపై డిమాండ్ నోటీసు వచ్చింది, పెనాల్టీ కూడా విధించారు. సచిన్ తన వాదనలో “ప్రకటనల్లో నేను నటుడిలా పని చేశాను. ఇది మోడలింగ్ లేదా యాక్టింగ్ వృత్తికి చెందిన పని. కాబట్టి 80ఆర్‌ఆర్ వర్తిస్తుంది” అని చెప్పాడు.ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ మాత్రం “సచిన్ క్రికెటర్. ప్రకటనలు అనేవి సైడ్ ఇన్‌కమ్ మాత్రమే. ఇది ఇతర వనరుల ఆదాయంగా పరిగణించాలి. 80ఆర్‌ఆర్ వర్తించదు” అని వాదించింది.

కేసు ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్ ముందు వెళ్లింది. ట్రైబ్యునల్ తీర్పులో “యాక్టర్ పనిలో కళాత్మక నైపుణ్యం, సృజనాత్మకత అవసరం. టెలివిజన్ ప్రకటనలు కూడా ఈ వర్గంలోకి వస్తాయి” అని తెలిపింది.. అదే విధంగా “ఒక వ్యక్తి రెండు వేర్వేరు వృత్తులు చేపట్టవచ్చు. సచిన్ విషయంలో క్రికెటర్‌గా ఒకటి, నటుడిగా మరొకటి” అని స్పష్టం చేసింది.దీని ఫలితంగా ఐటీ సెక్షన్ 80ఆర్‌ఆర్ కింద సచిన్‌కు పూర్తి డిడక్షన్ అనుమతించింది. ఇది కళాత్మక ప్రదర్శన కింద పరిగణించి, సచిన్ టెండూల్కర్ సుమారు 1.77 కోట్ల డిడక్షన్ తీసుకోవడంతో 58 లక్షల రూపాయల పన్ను ఆదా చేసుకున్నాడు.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80RR రచయితలు, కళాకారులు, నటులు, సంగీతకారులు లేదా క్రీడాకారులు మరియు విదేశీ మూలాల నుండి ఆదాయాన్ని ఆర్జించిన నిపుణులకు పన్ను మినహాయింపును అందిస్తుంది. అటువంటి సందర్భాలలో, మొత్తం విదేశీ ఆదాయం పన్ను నుండి మినహాయించబడుతుంది. చివరకు ఈ వ్యవహారం ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ)కి చేరింది. ట్రిబ్యునల్ ఆసక్తికర తీర్పు వెలువరించింది. “నటుడు” యొక్క నిర్వచనాన్ని సంకుచితంగా నిర్వచించలేమని తెలిపింది. ప్రకటనల ద్వారా సచిన్ ఆదాయం క్రికెట్‌కు సంబంధించిన పని కాదని, “కళాత్మక ప్రదర్శన” ఫలితమని ట్రిబ్యునల్ స్పష్టంగా తెలిపింది. కాబట్టి, అతను సెక్షన్ 80RR కింద పన్ను మినహాయింపుకు అర్హత కలిగి ఉన్నారని వెల్లడించింది. Sachin Tendulkar.

అయితే రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ వృత్తిని కలిగి ఉండవచ్చు. ఇక సచిన్ విషయానికొస్తే, అతను బ్రాండ్‌ను ప్రచారం చేస్తూ కెమెరాలో ఉన్నప్పుడు అతను లెజెండరీ క్రికెటర్ మాత్రమే కాదు, నటుడు కూడా. సచిన్ ఉదాహరణతో మనం ఏం అర్థం చేసుకోవాలంటే ట్యాక్స్ చట్టాలను సరిగ్గా అర్థం చేసుకుంటే పెద్ద మొత్తంలో ఆదా సాధ్యమవుతుంది. ఆదాయాన్ని సరైన వృత్తి కింద వర్గీకరించడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి ఒక్కటి కాక, రెండు వృత్తులు కూడా చేసుకోవచ్చు. వాటిని బట్టి ట్యాక్స్ ప్రయోజనాలు పొందవచ్చు. తెలివిగా ఆలోచిస్తే చట్టపరంగా కూడా మన ఆదాయాన్ని కాపాడుకోవచ్చు.