ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ గా దక్షిణాఫ్రికా..!

Spread the love

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) మూడో రౌండ్ (2023-25) ఫైనల్‌లో/… ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా హోరాహోరీగా తలపడ్డాయి.

లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా విజయ దుందుభి మోగించింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో సౌతాఫ్రికా నయా హిస్టరీ క్రియేట్ చేసింది.

డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సఫారీలు చిత్తు చేశారు ఆఫ్రికన్ ఆటగాళ్లు. కెప్టెన్ భవుమా, ఓపెనర్ మార్ క్రమ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. 27 ఏళ్ల తర్వాత తొలిసారి ICC టైటిల్ సాధించింది. 27 ఏళ్ల కలను నిజం చేసుకున్నారు సఫారీలు. దక్షిణాఫ్రికా ఐదు వికెట్లు నష్టపోయి 282 లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. గత 27 సంవత్సరాలుగా ఆఫ్రికాపై ఉన్న చోకర్స్ ముద్ర తొలిగిపోయింది. దక్షిణాఫ్రికా 1998లో తన ఏకైక ICC టైటిల్‌ను గెలుచుకుంది.

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేసింది. బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకు ఆలౌట్ అయింది.

రెండో ఇన్నింగ్స్‌లో కంగారూ జట్టు 207 పరుగులు చేసి బవుమా జట్టుకు 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మార్ క్రమ్ 207 బంతుల్లో 14 ఫోర్లు బాది 136 పరుగులు సాధించాడు.డేవిడ్ గై బెడింగ్‌హామ్ 18 పరుగులతో రాణించారు. కెప్టెన్ బవుమా 134 బంతుల్లో 66 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

Man of the Match: Aiden Markram
Man of the Match: Aiden Markram