ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించిన “గూగుల్”

Spread the love

ప్రపంచవ్యాప్తంగా టెక్‌ ఉద్యోగాల కోత కొనసాగుతుంది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్‌ మార్కెట్లలో ఒత్తిడి, టారిఫ్‌ వార్‌, అమెరికాలో మాంద్యం భయాలు, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం కారణంగా వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 100 కంపెనీలు 27 వేల మం
దికిపైగా ఉద్యోగులపై వేటు వేశాయి. తాజాగా గ్లోబల్ టెక్ ‘గూగుల్’ (Google) ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించింది. ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌, పిక్సెల్‌ ఫోన్స్‌, క్రోమ్‌ బ్రౌజర్‌ విభాగాల్లో పని చేస్తున్న వందలాది మంది ఉద్యోగులకు గూగుల్ లేఆఫ్‌లు ప్రకటించింది. అయితే, ఎంతమందిపై లేఆఫ్స్‌ ప్రభావం పడిందన్నది తెలియరాలేదు. కాగా, గూగుల్‌ 2024 డిసెంబర్‌లో 10 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. అంతకుముందు 2023 జనవరిలో 12 వేల మంది ఉద్యోగులను గూగుల్ తొలగించింది.

ఇటీవలి కాలంలో చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని కంపెనీలు పలు కారణాలు చూపుతూ పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించాయి. 2025లో సాంకేతిక రంగంలో 100 కంపెనీలు 27,762 మంది ఉద్యోగులను తొలగించాయి. అంతకుముందు ఏడాది టెక్‌ రంగంలో 549 కంపెనీలు 1,52,472 మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. 2023లో 1,193 కంపెనీలు 2,64,220 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయని లేఆఫ్స్. ఎఫ్ వై వెబ్ సైట్ వివరాల ప్రకారం తెలుసాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *