కొత్త రూల్..!

Spread the love

Railway Ticket Booking: మన దేశంలో రైళ్లలో రద్దీ మామూలుగా ఉండదు. సీట్లు దొరకడం చాలా కష్టం. ఇక పండుగలు వచ్చాయంటే నెలల ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి న పరిస్థితి ఉంటుంది. దీంతో అటు రైల్వే శాఖ కూడా ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు నిబంధనల్లో చేంజస్ చూస్తూనే ఉంటుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మన దేశంలో అత్యధిక మంది ప్రయాణించేది రైల్లోనే. దేశంలో ఎక్కడికైనా కనెక్టివిటీ ఉండడం, అతి ధరలే దీనికి కారణం. రోజుకు కోట్ల మందిని రైళ్లు గమ్యస్థానాలకు చేరుస్తాయి. అటు రైల్వే శాఖ సైతం ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు తగిన మార్పులు, రూల్సు తీసుకొస్తుంటుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది రైల్వే ప్రయాణికులకు ఒక ముఖ్యమైన అప్డేట్‌గా చెప్పొచ్చు. అక్టోబర్ 1 నుంచి రైల్వే టికెట్ బుకింగ్‌లలో ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి కానుంది. అక్రమ బుకింగ్‌లను అరికట్టి, సాధారణ ప్రయాణికులకు సులభంగా టికెట్లు లభించేలా చేయడానికి రైల్వే బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఏదైనా రైలుకు టికెట్ బుకింగ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాలు కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే IRCTC వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోగలరు. ప్రస్తుతం తత్కాల్ బుకింగ్‌లలో ఈ విధానం అమల్లో ఉంది. ఇప్పుడు సాధారణ రిజర్వేషన్లకు కూడా దీనిని వర్తింపజేస్తున్నారు. బుకింగ్ ప్రారంభం కాగానే సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి అక్రమంగా టికెట్లను బుక్ చేసేవారిని నిరోధించడం దీని రోల్. ఈ మార్పు వల్ల సామాన్య ప్రయాణికులకు టికెట్లు సులభంగా దొరికే అవకాశం పెరుగుతుంది.

అయితే, తత్కాల్ టికెట్ల మాదిరిగానే సాధారణ టికెట్ల బుకింగ్ ప్రారంభమైన వెంటనే అయిపోతున్నాయి. అక్రమార్కులు సాఫ్ట్‌వేర్ సాయంతో ట్రైన్ టికెట్లు బుక్ చేసేస్తున్నారు. దీంతో సాధారణ ప్రయాణికులకు టికెట్లు దొరకడం లేదు. ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే రైల్వే రిజర్వేషన్ టికెట్లు అక్రమార్కుల చేతిలో పడకుండా సామాన్య యూజర్లకు ప్రయోజనాలు అందించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే టికెట్ బుకింగ్ బోర్డు తెలిపింది. ఈ మేరకు అన్ని జోనల్ ఆఫీసులకు సమాచారం అందించినట్లు తెలిపింది. రైల్వే స్టేషన్‌లోని రిజర్వేషన్ కౌంటర్‌లో టికెట్ బుకింగ్ టైంలో ఎలాంటి మార్పు ఉండదు.

అయితే తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి చేస్తూ ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నారు. జూలై 1, 2025 నుంచి ఈ రూల్స్ అమలు చేశారు. తత్కాల్ బుకింగ్‌లో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆధార్ ఉంటేనే తత్కాల్ టికెట్ బుకింగ్ అవకాశం కల్పించారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ ద్వారా ఆధార్ అథెంటికేషన్, కేవైసీ చేసిన వారికే తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసే వీలు కల్పించారు. ఇక జూలై 15 తర్వాత తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసుకునే వారు ఆధార్ ఓటీపీ కూడా ఎంటర్ చేయాల్సి వస్తోంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసి సాధారణ కస్టమర్లకు టికెట్లు దక్కేలా చేయడమే ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు కారణంగా రైల్వే విభాగం తెలిపింది. ఐఆర్‌సీటీసీలోని తమ అకౌంట్‌తో ఆధార్ అథెంటికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పుడు జనరల్ టికెట్ల బుకింగ్ సైతం ఆధార్ అథెంటికేషన్ చేయాల్సి వస్తోంది. తరుచూ రైలు ప్రయాణాలు చేసే వారు టికెట్ బుకింగ్ చేసుకునేందుకు ఇబ్బందులు తొలగుతాయని రైల్వే విభాగం చెబుతోంది. ఆధార్ తప్పనిసరి చేయడంతో అక్రమార్కుల చేతికి టికెట్లు వెళ్లవని అంటున్నారు. Railway Ticket Booking.

రైల్వే బోర్డు ఈ నిర్ణయం వల్ల ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సురక్షితంగా మారుతుంది. ఈ మేరకు అన్ని జోనల్ కార్యాలయాలకు ఇప్పటికే సమాచారం అందించింది. రైల్వే ప్రయాణాలను మరింత సమర్థవంతంగా, సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని రైల్వే అధికారులు తెలిపారు.