
Amazon Freedom Festival Sale: ఇది పండుగల సీజన్.. అలానే షాపింగ్ మాళ్ళు, జ్యువెలరీ మాల్స్.. అంతటా ఎలానైతే కస్టమర్లను వన్ ప్లస్ వన్, బై వన్ గెట్ టు ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయో.. ఆన్‌లైన్‌లోని ఈ.కామర్స్ సైట్లు కూడా గ్రేట్ డీల్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. ఈ డీల్స్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే తరుణం రానేవచ్చింది.. అదే ఆగస్టు 15, ఇండిపెండెన్స్ డే.. ఈ సందర్భంగా అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపు ధరలతో… అమెజాన్ తన సైట్‌లో గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ 2025 పేరిట ఓ ప్రత్యేక సేల్‌ను అయితే స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లే కాకుండా ఇతర ప్రొడక్ట్స్ పైన ఆకట్టుకునే డీల్స్, డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఈ సేల్‌లో మొబైల్స్, యాక్ససరీలపై 40 పర్సంట్ తగ్గింపు ఉండనుంది.
ఈ సేల్‌లో రెడ్‌మీ 13 5జి స్మార్ట్ ఫోన్‌ను రూ.11,699కు, అలాగే రియల్‌మి నార్జో 80 లైట్ 5జి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్‌ను రూ.10,499కు, లావా బ్లేజ్ డ్రాగన్ 5జి ఫోన్‌ను రూ.8,999కు కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ 13కు చెందిన అన్ని వేరియెంట్లపై ఆగస్టు 31 వరకు తాత్కాలికంగా రూ.7వేల తగ్గింపు ధరను ఇస్తున్నారట. దీనిపై 9 నెలల నో కాస్ట్ ఈఎంఐ కూడా వర్తింపు ఉంది. వన్‌ప్లస్ 13ఎస్‌కు చెందిన అన్ని వేరియెంట్లపై రూ.5వేల బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు రూ.3వేల ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు.
ఈ సేల్‌లో భాగంగా వన్ ప్లస్‌కు చెందిన ఇయర్‌బడ్స్‌పై కూడా రూ.500 నుంచి రూ.2వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇక ల్యాప్‌టాప్ విషయానికొస్తే లెనోవో థింక్ ప్యాడ్ 16ను రూ.46,990 స్టార్టింగ్ ప్రైస్‌కే కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌కు చెందిన అలెక్సా, ఫైర్ టీవీ డివైస్‌లపై 30 శాతం వరకు తగ్గింపు ధరను అందిస్తున్నారు. పలు ఆడియో డివైజ్‌లను కూడా తగ్గింపు ధరలకే పొందవచ్చు. మరిన్ని వివరాలకు అమెజాన్‌లో అందుబాటులో ఉన్న డీల్స్ పేజ్‌ను విజిట్ చేయండి.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం వరకు అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్, అమెజాన్ పే యూపీఐ ట్రాన్సాక్షన్లపై 5 శాతం అష్యూర్డ్ క్యాష్‌బ్యాక్ లను పొందొచ్చు. అలాగే పలు ఇతర బ్యాంకులకు చెందిన కార్డులపై కూడా రాయితీలున్నాయి. ఇక ఈ సేల్ ముగింపు తేదీని అయితే ఇంకా చెప్పలేదు. కానీ ఈ సేల్ ఆగస్టు 31 వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది.