
ఈ మధ్య కాలంలో మనం ఎక్కడికి వెళ్ళాలన్నా..
మనం ఫుడ్ డెలివరీ, వస్తువులు డెలివరీ పెట్టుకున్న.. గూగుల్ మ్యాప్ సాయంతో.. లైవ్ ట్రాకింగ్ చూడగలుగుతున్నాం. సులువుగా మన గమ్యస్థానాలకు చేరుకోగలుగుతున్నాం. ఇలా గూగుల్ మ్యాప్స్ అనేవి ప్రతి విషయంలో హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. కానీ రోడ్డు దారులపై కొన్ని రకాల రేఖలు రంగులతో ఉంటాయి కదా.. ఎప్పుడైనా గమనించారా? వీటి అర్థం ఏంటో తెలుసా..?
నిజానికి గూగుల్ మ్యాప్స్‌లో వివిధ రంగులు ఏం చెబుతున్నాయి అంటే.. మీరు చేసే ప్రయాణం గురించి కచ్చితమైన సమాచారాన్ని అందించేందుకు.. మీరూ వెళ్లే చోటును మరింత సులభంగా గుర్తించేందుకు అనువుగా వీటిని తయారుచేశారు.
గ్రీన్ కలర్: ఒక రోడ్డు ఆకుపచ్చ రంగులో కనిపించినప్పుడు ఆ రోడ్డుపై ట్రాఫిక్ లేదని అర్థం. పసుపు లేదా నారింజ: రోడ్డుపై కొంత జనసమూహం ఉందని అర్థం. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీనికి ఎక్కువ సమయం పట్టదు అని సూచిస్తుంది.
ఎరుపు: ఈ రంగు చూసిన వెంటనే అప్రమత్తంగా ఉండండి. ఇది భారీ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాన్ని చూపిస్తుంది. అది ముదురు ఎరుపు రంగులోకి మారితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని అర్థం.
నీలం: మీరు ఒక ప్రదేశం కోసం సెర్చ్ చేసినప్పుడు కనిపించే నీలిరంగు గీత మీ ప్రయాణానికి ప్రధాన మార్గం. అంటే గూగుల్ మీరు అదే మార్గం గుండా వెళ్ళమని సలహా ఇస్తుందన్న మాట.
ఊదా రంగు: కొన్నిసార్లు గూగుల్ మీకు ఊదా రంగులో కనిపించే మరొక ఎంపికను కూడా చూపిస్తుంది. ఈ మార్గం కొంచెం లాంగ్ అవ్వచ్చు. లేదా అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉండవచ్చు.
గోధుమ రంగు: ఈ రంగు పర్వతాలకు గుర్తింపు. మీరు ఒక ప్రదేశంలో గోధుమరంగు నీడను చూసినప్పుడు అక్కడ ఎత్తైన ప్రాంతాలు లేదా పర్వత మార్గాలున్నాయని అర్థం. ఇది ట్రెక్కింగ్ చేసేవారికి ఉపయోగపడుతుంది.
చాలా మంది గూగుల్ మ్యాప్స్ వాడతారు. కానీ అందులో చూపిన రంగుల అర్థం అంతగా తెలియదు. అందుకే వారు తరచుగా ట్రాఫిక్‌లో చిక్కుకుంటారు లేదా తప్పుడుమార్గంలో వెళతారు. మీరు ఈ రంగులను గనుక ఇకపై గుర్తించగలిగితే, మీరు మీ టైమ్ ను ఆదా చేసుకోవడం, మీ జర్నీనీ మరింత సౌకర్యవంతంగా మార్చుకోవచ్చు.