
Safe Data with 2 step Verification: నేటి డిజిటల్ యుగంలో ఐడెంటిటీ థెఫ్ట్ (గుర్తింపు చోరీ) అనేది మన పర్సనల్ అండ్ ఫైనాన్షియల్ సేఫ్టీకి పెద్ద ముప్పుగా పరిణమించింది. ఆధార్ నంబర్ నుంచి ఇ-మెయిల్ సందేశాలు, డీప్ ఫేక్ సాంకేతికత వరకూ పర్సనల్ డేటాను మిస్ యూస్ చేసేందుకు లేటెస్ట్ టెక్నాలజీనుపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముప్పును ఎదుర్కొనేందుకు మనం ఎలాంటి సేఫ్టీ మేషర్స్ పాటించాలో తెలుసుకుందాం:
ఒక వ్యక్తి పర్మిషన్ లేకుండా వారి వ్యక్తిగత వివరాలు అంటే.. ఆధార్ నంబర్, ఫింగర్ ప్రింట్, ఆన్లైన్ లాగిన్ డీటైల్స్ నుపయోగించి ఆర్థిక మోసాలు చేయడాన్నే గుర్తింపు చోరీ/ ఐడెంటిటీ థెఫ్ట్ గా చెప్పవచ్చు. ఫలితంగా విక్టిమ్స్ తాము తీసుకున్న రుణాలకు బాధ్యత వహించాల్సి రావడం, అనధికార లావాదేవీలు, క్రెడిట్ స్కోర్ దెబ్బతినడంలాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. Safe Data with 2 step Verification.
అప్రమత్తత అవసరం..
ఇందుకోసం ఏం చేయాలంటే.. స్ట్రాంగ్ పాస్ వర్డ్, టూ స్టెప్ వెరిఫికేషన్, క్రెడిట్ రిపోర్ట్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం బెటర్. కానీ ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్ లాంటి ఎన్నో అధునాతన సాంకేతికతలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంప్రదాయ భద్రతా చర్యలు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఆర్ధిక సంస్థలు వీటికనుగుణంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ, మనం మరింత అలెర్ట్ నెస్ తో ఉండాల్సినవసరం ఉంది.
- ఏఐ ఆధారిత మోసాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వింటున్నాం. వీటిపై అవేర్నెస్ పెంచుకోవాలి.
- ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్ లో వచ్చే మోసాలను గమనిస్తూ, వాటిని నివారించేందుకు నిపుణులు ఎటువంటి సలహాలు ఇస్తున్నారో గుర్తెరిగి నడుచుకోవాలి.
- ప్రతి పర్సనల్ బ్యాంక్ అకౌంట్ కి టఫ్ అండ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ ను మాత్రమే పెట్టుకోవాలి.
- రెండుకు మించిన ద్రువీకరణలుపయోగించేలా చూసుకోవాలి.
- ఇ-మెయిల్, మొబైల్ కి వచ్చే మెసేజెస్ లో వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దు. అవి మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేయవచ్చు.
- బ్యాంక్, క్రెడిట్ కార్డు ట్రాంసాక్షన్స్ ను ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవడం తప్పనిసరి.
Also Read: https://mega9tv.com/technology/open-ai-ceo-sam-altman-warned-against-over-reliance-on-chatbots/