
“ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లెమ్ నీకు..”
“నిజంగానే నువ్వు నన్ను ఈ క్వెషన్ అడుగుతున్నవా రాధికా..?!”
ఇలాంటి మన ఫేవరేట్ సినిమా డైలాగ్ లను ఇప్పుడు క్రియేటివ్ గా అండ్ క్రేజీగా మలచి చేస్తున్నారు గమనించారా?! అవును ఈ మధ్య కాలంలో మనకు నచ్చిన హీరో లేదంటే హీరోయిన్ చిన్న పిల్లలా మారి డైలాగ్స్ చెబుతుంటే భలే ఉంది. టెక్నాలజీ పుణ్యమా అని రోజుకో కొత్త ట్రెండ్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ విశేషంగా ఆకట్టుకుంటుంది.
జిబ్లి పోయి ఇప్పుడు ఏఐ జనరేటెడ్ క్యూట్ బేబీ వీడియోలు (AI generated cute baby video) వచ్చాయి. చిన్నారుల్లా మారిన కొందరు రాజకీయ నాయకులు, సినీ తారలు, ఇతర ప్రముఖుల వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముసలివాళ్లను కూడా పసిపిల్లలుగా మారుస్తూ.. నెట్టింట నవ్వులు పూయిస్తోంది ఈ ఏఐ మాయాజాలం. ఏదైనా కొత్త ట్రెండ్ వచ్చిందంటే చాలు.. ఫ్యాన్స్ తమ ఫేవరేట్ వ్యక్తులను తనుకు నచ్చినట్లుగా మార్చుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంబరపడిపోతుంటారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సహా ఇతర ముఖ్య నేతలు పసిపిల్లల్లా మారి లోక్ సభలో ప్రసంగిస్తున్నట్లుగా ఉండేలా వీడియోలను క్రియేట్ చేయడం విశేషం.
ఈ ముద్దులొలికే చిన్నారి వీడియోలను మీరు క్రియేట్ చేయవచ్చు. ఇది ఎంతో ఈజీ!
చాట్ జీపీటీ లేదా ఇతర ఏఐ టూల్స్ నుపయోగించి పిల్లాడిలా కనిపించే ఫొటో ఒకటి క్రియేట్ చేయాలి.
తర్వాత వీడియో రూపంలో కావాలంటే ఫొటోను అప్లోడ్ చేసి సరైన ప్రాంప్ట్ ఇవ్వాలి.
ఏఐ టూల్ ఆ ఫొటోను చిన్నారి ముఖంలోకి మార్చి వీడియోగా మార్చుతుంది అంతే!