వాట్సాప్ స్టోరేజ్ నిండిదా.. ఇలా క్లియర్ చేయండి!

Spread the love

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ తరహా వాట్సాప్ వాడకం ఇప్పుడు అంతటా పెరిగింది. ఇంపార్టెంట్ మెసేజ్, ఇమేజ్ నుంచి కాలక్షేపం, సరదాగా తీసుకున్న ఫోటోలు, వీడియోలు సైతం వాట్సాప్ చేసుకోవడంతో పాటు ఆఫీసు పనులు, ఫైల్స్, క్లాసెస్ కి సంబంధించిన నోట్స్, బ్యాంక్ వర్క్స్ ఇలా ఆన్లైన్ తో అనుసంధానమైన ప్రతి పనిని సులువు చేసేస్తుంది ఈ వాట్సాప్.

అయితే ఎంత ఉపయోగపడుతున్నప్పటికీ ఎక్కువ ఎంబితో ఉన్న ఆఫీసు ఫైల్స్, ఫోటోలు, గ్రూప్ చాట్ హిస్టరీ, ప్రతిదీ ఒకరోజు, రెండు రోజులకు వాట్సాప్‌లో స్టోరేజ్ సమస్యలను తెస్తుంది. దీని కారణంగా ఫోన్ హ్యాంగ్ అయ్యే సమస్య చాలా తరచుగా తలెత్తుతుంది. అలాంటప్పుడు మీ వాట్సాప్‌ డేటాను సురక్షితంగా ఉంచుకుంటేనే అనవసర ఫైల్స్, డేటాను ఎలా క్లియర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ తెరవగానే కుడి వైపున కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి, స్టోరేజీ డేటాకు వెళ్లాలి. స్టోరేజీని నిర్వహించేందుకు ఎంపికపై క్లిక్ చేయండి. మీ డేటాను లిస్ట్ ఔట్ చేసుకుంటూ ఫిల్టర్ చేసుకోవచ్చు లేదంటే తీసేయొచ్చు కూడా.
  • ఇప్పుడు ఇక్కడ మీరు తొలగించగల చాట్ లేదా వాట్సాప్ ఛానెల్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇది స్టోరేజ్ ని మాత్రమే క్లియర్ చేస్తుంది. ఇందుకు క్లియర్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే చాలు.
  • మీ ఫోన్‌లో ఫోటో లేదా వీడియో కాపీలు ఒకటికి మించి ఎక్కువగా సేవ్ చేసి ఉంటే, అన్ని కాపీలను తీసెయొచ్చు. ఎందుకంటే మీ ఫోన్ మీడియాలో ఇదివరకే ఆ ఫోటో, వీడియోలు సేవ్ అయి ఉంటాయి కాబట్టి.
  • వాట్సాప్ నుంచి అన్ని అనవసరమైన మీడియా ఫైల్స్ ను డిలీట్ చేయండి. ఈ ఎంపిక ఫోన్ గ్యాలరీలో ఉంటుంది.
  • ఒక్కోసారి చాట్ హిస్టరీ కారణంగా వాట్సాప్ స్టోరేజ్ ఎక్కువగా నిండిపోతుంది. ఈ స్టోరేజ్ ను క్లియర్ చేయడానికి మీరు చాట్ హిస్టరిని తొలగించాలి. దీని కోసం, మీరు సంబంధిత చాట్‌ను ఓపెన్ చేసి, క్లియర్ చాట్ అని కొడితే క్లియర్ అవుతుంది.
  • అదేవిధంగా మీరు గ్రూప్ చాట్‌ను కూడా క్లియర్ చేయవచ్చు. గ్రూప్ చాట్‌లలో అత్యధిక ఫోటోలు, వీడియోలు, చాట్‌లు ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు తొలగించడం చాలా ముఖ్యం.