మెటాతో ‘ఇమాజిన్ మీ’ ఎంతో ఈజీ..!

Spread the love

Imagine Me a meta technology: మీరు నచ్చిన కామిక్ హీరో.. సినిమా హీరోలా మీరు మారిపోతే.. వారిలా రెడీ అయిపోతే ఎలా ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి. ఊహించుకోవటానికి బాగానే ఉందికానీ, ఎలా పాజిబుల్ అని అనుకుంటున్నారా? ఇక మెటా టెక్నాలజీ అయిన ఇమాజిన్ మీ అనే ఫీచర్ తో ఇది త్వరలో సాధ్యమవుతుంది. మెటా సంస్థ ఇటీవలే మనదేశంలో దీన్ని అఫిషియల్ గా ఇంట్రడ్యూస్ చేసింది. మామూలు టెక్స్ట్ ప్రాంప్ట్స్ తో క్రియేటివిటీ, పర్సనల్ ఇమేజ్లను సృష్టించేలా తయారైన ఇది ఇన్స్టాగ్రామ్, మెసేంజర్, వాట్సప్ చాట్స్ లో ఇక అందుబాటులో ఉండనుంది.

పర్సనల్ లేదా గ్రూప్ చాట్స్ లో నేరుగా మెటా ఏఐతో సంభాషించటం ద్వారా దీని సేవలను పొందొచ్చు. పాతకాలం హీరో లేదా మీకు నచ్చిన కామిక్ సినిమాలోని హీరోలా ‘ఇమాజిన్ మీ’ అని ప్రాంప్ట్ అందిస్తే చాలు! కోరుకున్నట్టుగా ఏఐ క్రియేట్ చేసిన ఇమేజ్ వస్తుంది.

ఎలా వర్క్ చేస్తుందంటే..
‘ఇమాజిన్ మీ’ని వాడేముందు ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, వాట్సప్ లోని ఏదో ఒకదాంట్లో @Meta AI తో సంభాషణ మొదలెట్టాలి. ఫస్ట్ టైం వాడేటప్పుడు యూజర్లను కొన్ని సెటప్ ఫోటోలను అప్లోడ్ చేయాలని కోరుతుంది. వీటిద్వారా ఫేస్ మూవ్మెంట్స్, శరీర ఆకారాన్ని అర్థం చేసుకొని.. Imagine Me a meta technology.

ఆ తర్వాత అడిగిన విధంగా ఇమేజ్ లను సృష్టించేస్తుంది. ఇది టెక్ట్స్ ను కాకుండా ఫొటోలనూ ప్రాంప్ట్ లుగా తీసుకుంటుందనీ గుర్తుంచుకోండి. సెటప్ ఫొటోలను మెటా ఏఐ సెటింగ్స్ ద్వారా ఎప్పుడైనా మీరు అప్డేట్ చేయొచ్చు లేదా తీసేయొచ్చు. నచ్చిన ప్రిఫరెన్స్ లను మార్చుకోవచ్చు. ఇమేజ్ ను తిరిగి పొందొచ్చు. మొత్తానికి వద్దనుకుంటే ఈ ఫీచర్ ను ఇబ్బంది లేకుండా డిసేబుల్ కూడా చేసుకోవచ్చు.

Also Read: https://mega9tv.com/technology/tata-in-top-place-as-the-most-attracted-company-and-what-are-the-things-that-tata-group-scored-high-on/