జనం మెచ్చిన నేత

Spread the love

బెంజ్ కాదు.. గంజీ అంటేనే ఇష్టం..

జగ్గారెడ్డి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. ఆయన మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా అందులో నిజముందనే నమ్మే జనాధరణ ఆయన సొంతం. నెరిసిన గడ్డంతో.. జనంలో ఒకడిగా కనిపించే తీరు జగ్గారెడ్డి మాత్రమే సొంతమని చెప్పడంలో ఏలాంటి అతియోశక్తి లేదు. అయితే జగ్గారెడ్డి అసలు పేరు జయప్రకాశ్ రెడ్డి. ఈయన్ను కార్యకర్తలు ముద్దగా జగ్గన్న అని పిలుచుకుంటారు. కార్యకర్తలే తన బలంగా భావించే జగ్గారెడ్డి ..1966, జూలై 7న జగ్గారెడ్డి – జామాయమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, కంది మండలంలోని ఇంద్రకరణ్ గ్రామంలో జన్మించారు. జగ్గారెడ్డి చదవుకుంది పదో తరగతే అయినా.. రాజకీయాల్లో మాత్రం పీహెచ్డీ చేశారు.

పెద్దగా చదువుకోకపోయినా.. ప్రజలకు సేవ చేయ్యాలని ఆసక్తి ఆయనకు.. చిన్ననాటి నుంచే ఉండేది. అందుకే 1986లో భారతీయ జనతా పార్టీ తరఫున సంగారెడ్డి పురపాలక సంఘం కౌన్సిలర్‌ గా.. తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1995లో సంగారెడ్డి పురపాలక సంఘం చైర్మెన్ అయ్యారు. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సంగారెడ్డి సెగ్మేంట్ నుంచి టీఆర్ఎస్ తరపున పోటీచేసి 17వేల676 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ ఎమ్మెల్యే గా గెలిచి..2012 నుంచి 2014 మధ్య ప్రభుత్వ విప్‌ గా పనిచేశారు. 2014 శాసనసభ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి.. పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో లోక్‌సభ ఎన్నికలకు ముందు కమలం పార్టీలో చేరి.. మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2015లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 మళ్లీ సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత నుంచి కూడా యాక్టివ్ గా ఉంటూ వచ్చారు జగ్గారెడ్డి. 2023 ఎన్నికల్లో సమయంలో కూడా పార్టీ విజయం కోసం ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా జగ్గారెడ్డి కి ముక్కుసూటి మనిషిగా కూడా పేరుంది. కాంగ్రెస్ అధికారంలో లేని సమయంలో కూడా జగ్గారెడ్డికి మెడికల్ కాలేజీ తెప్పించుకున్నారు. అంతా సత్తా ఉన్న నేత జగ్గారెడ్డి. 2021 లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే వైద్య కళాశాలను మంజూరు చేయించుకున్నారు. పత్యర్థులు సైతం స్నేహంగా పలకరించే గొప్ప మనసున్న నేత. సంగారెడ్డి లో ఏ గల్లీని అడిగిన జగ్గారెడ్డి రెడ్డి గురించి చెబుతున్నారు. అంతటి మంచితనం ఆయన సొంతం. కార్యకర్తలను సైతం కుటుంబంలా భావిస్తున్నారు. వారికి కష్టం వస్తే దగ్గరుండి తీర్చుతారు. అదే ప్రజలకు సొంత ప్రభుత్వం అన్యాయం చేసిన నిలదీస్తారు. తమ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పాటుపడుతుంటారు. ఈ రెండేళ్లలో కూడా జగ్గారెడ్డి చాలా సార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదంటూ గట్టిగా చెప్పారు. అంతేకాకుండా సంగారెడ్డికి మంచి నీటి కష్టాన్ని తీర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉన్న సరే.. సంగ్గారెడ్డి లో మాత్రం అభివృద్ధి కనిపించేది. ప్రజల కోసం కోట్లాడి మరీ నిధులను మంజూరు చేయించుకునేవారు.

కాంగ్రెస్ నిలదీయడమే కాదు.. పార్టీకి కష్టం వస్తే అండగా ఉండడం కూడా ఆయనకు తెలుసు. 2023 ఎన్నికలకు ముందు వరుసగా పలువురు నాయకులు పార్టీలు మారుతుంటే.. జగ్గారెడ్డి మాత్రం పార్టీకి మద్దుతుగా ప్రెస్ మీట్లు పెట్టి.. అప్పటి ప్రభుత్వానికి గట్టి కౌంటర్లు ఇచ్చారు. అలాగే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత.. జగ్గారెడ్డి ని అధిష్టానం పక్కన పెట్టింది. అప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ కోసం పనిచేశారు. ఎంపీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు. జగ్గారెడ్డి కష్టాన్ని చూసిన అధిష్టానం మంచి పదవిని కట్టబెట్టింది. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేసేందుకుగాను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 2025 జులై 7న ఏర్పాటు చేసిన ఇంఛార్జ్‌ లలో భాగంగా జగ్గారెడ్డిని ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఇన్‌ చార్జ్‌ గా నియమించారు. అప్పటి నుంచి జగ్గారెడ్డి లైప్ లైట్ లోకి వచ్చారు. సంగారెడ్డి పరిధిలో డివిజన్ ల వారిగా మీటింగ్ లు పెడుతూ.. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించాలనే లక్ష్యంతో గాంధీ భవన్ వేదిక వరుస సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా ఇటీవలే జరిగిన సదర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ కూడా ఆయన హైలెట్ గా నిలిచారు. ఇలా 1986 నుంచి ఇప్పటి వరకు కూడా జగ్గారెడ్డి తనదైన రాజకీయ వ్యూహాంతో రాణిస్తున్నారు. ప్రత్యర్థ పార్టీలు సైతం మెచ్చుకునే నేతగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటీకీ కూడా ఆయన చెప్పే మాట ఒకటే.. చాలామంది గంజీ నుంచి బెంజ్ వరకు వచ్చి.. తాము ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోతుంటారు. కానీ నాకు మాత్రం గంజీ అంటే ఇష్టం అని. ఈ ఒక్కమాట చాలు కదా.. జగ్గారెడ్డి అంటే ఏంటో చెప్పడానికి. అందుకే జగ్గారెడ్డి ఇప్పటికీ ఎప్పటికీ జనం మెచ్చిన నేత.