క్రికెట్‌ అభిమానులు ఫేక్ యాప్స్ తో జాగ్రత్తగా ఉండాలన్న సజ్జనార్ 

Spread the love

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. క్రీడాభిమానులు భారీ స్థాయిలో ఈ టోర్నమెంట్ ను స్టేడియం లో చూడాలని ఆశతో ఉంటారు. అయితే సైబర్ మాయగాళ్లు వీరి ఆశను ఆసరాగా చేసుకుని తమ అత్యాశను ప్రదర్శించే అవకాశం ఉన్న నేపథ్యంలో సీపీ సజ్జనార్ అభిమానులను అప్రమత్తం చేశారు. క్రికెట్‌ అభిమానులు ఫేక్ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈనెల 22న జరగనున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కు భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. దీంతో దీనిని అవకాశంగా తీసుకున్న సైబర్‌ కేటుగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. టికెట్ల కోసం అభిమానుల్లో ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని, నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఐపీఎల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అనేక ప్రకటనలు కనిపిస్తున్నాయి. అధికారిక టికెటింగ్‌ భాగస్వామి అయిన ‘డిస్ట్రిక్ట్‌’ (District) యాప్‌ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్‌లను క్రియేట్ చేసి  తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ఆశ చూపుతున్నారు. అసలు యాప్ విధంగానే ఉన్న ఉన్న ఈ నకిలీ లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకుంటేసొమ్ము గల్లంతవ్వడం ఖాయమని పేమెంట్ చేసిన తర్వాత టికెట్లు రాకపోగా, మీ బ్యాంకింగ్ వివరాలు కూడా సైబర్ నేరగాళ్ల పరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మీ కష్టార్జితాన్ని కేటుగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని క్రికెట్ ప్రియులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మ్యాచ్‌ చూడాలనే ఉత్సాహంతో సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక లింకులను నమ్మి మోసపోవద్దని ఇలాంటి ఫేక్ యాప్ లు, వెబ్ సైట్స్ పై నిఘా ఉంచినట్లు తెలిపారు. ఎవరైనా ఇటువంటి ఫేక్ యాప్స్ లేదా వెబ్‌సైట్ల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు పిర్యాదు చేయాలని కోరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *