నేను ఎన్నో తట్టుకుని వచ్చాను:బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్

Spread the love

బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన, పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపు (26వ ఆవిర్భావ దినోత్సవం) సందర్భంగా తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు మరియు విద్యార్థి సంఘం నేతలు హాజరయ్యారు.రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనటం చేతకావటం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కావటం లేదన్న ఆయన తెలంగాణా ప్రజలు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల ప్రజలు పెద్ద అంబేద్కర్ విగ్రహాన్నీ చూడడానికి వస్తుంటే ఈ ప్రభుత్వం గేట్లు తీయలేదన్నారు. అశోక్ గులాటీ అనే మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు రైతు బంధు పథకం తెచ్చినట్లు తెలిపారు. 2009 లో చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకే అప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. ఇటీవల పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. టిఆర్ఎస్ ఎంపీలు సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లన్నారు. ఇక్కడ ఒక్కరు కూడా స్పందించలేదన్నారు. సిఆర్ పాటిల్ కాలేశ్వరం గురించి మాట్లాడితే రాజ్యసభలో సురేష్ రెడ్డి గట్టిగా ఖండించారన్నారు. తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ బిజెపి నేతలు మనుషులు కారా అని మండిపడ్డారు. ఎన్నో సందర్భాల్లో తనను  మానసిక క్షోభకు గురి చేశారని విమర్శించారు. ఎన్నో తట్టుకుని నిలబడ్డానన్నారు. హైదరాబాద్ విషయంలో వెనక్కి తగ్గమని సోనియాగాంధీ 16 సార్లు చెప్పినా కాంప్రమైజ్ కాలేదన్నారు. రాష్ట్ర కమిటీ తప్ప మిగతా కమిటీలు అన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం తర్వాత తిరిగి బిఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణమని పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *